ప్రచారంలో మాటల తూటాలు | Sakshi
Sakshi News home page

ప్రచారంలో మాటల తూటాలు

Published Sun, May 12 2024 12:30 PM

-

సాక్షి, సిటీబ్యూరో: మహాభారత కురుక్షేత్రంలో యోధానుయోధులు పాల్గొన్నట్లే.. ప్రజాస్వామ్య రణక్షేత్రంలో తమ పార్టీని గెలిపించేందుకు అతిరథ మహారథులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాము అమలు చేయబో యే సంక్షేమ కార్యక్రమాల కంటే ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు మాటల తూటాలనే ప్రధాన ఆయుధాలుగా మలచుకున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్న చందంగా అవినీతి, రిజర్వేషన్లు, కరెంటు, రాజ్యాంగం, యూటీ తదితర అంశాలను ప్రస్తావించారు. గ్రేటర్‌ పరిధిలో 4 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలిస్తే మూడొంతుల ప్రజల మనసులు గెలుచుకున్నట్లు కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాతబస్తీ పరిధిలో సైతం గతానికి భిన్నంగా పరిస్థితి మారింది. ప్రచా రం కంటే చేసే పనులే గెలిపిస్తాయని నమ్మే మజ్లిస్‌ పార్టీ సైతం ఈసారి ప్రచారంలోకి దిగడం పోటీ తీవ్రతను చాటింది. మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ హోరాహోరీ ప్రచారాలతో దుమారం రేపాయి.

ప్రధాని మోదీ, అమిత్‌ షా..

ప్రధాని మోదీ గ్రేటర్‌ పరిధిలోని నియోజక వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మల్కాజిగిరిలో రో డ్‌షోలో, ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభలో పా ల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహిస్తున్న హోంమంత్రి అమిత్‌షా ఓల్డ్‌సిటీలో రోడ్‌షోతో పాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని వికారాబాద్‌లలో ప్రచారాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైతం ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ పార్టీకి చెందిన మరికొందరు జా తీయ నాయకులు రాజ్‌నాథ్‌ సింగ్‌, తేజస్వీ సూర్య, నవనీత్‌కౌర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రా ష్ట్రాల సీఎంలు భూపేంద్ర పటేల్‌, మోహన్‌ యాద వ్‌, భజన్‌లాల్‌ శర్మలు సైతం పర్యటనలు చేశారంటే ఎంతటి ప్రాధాన్యమిచ్చారో ఊహించుకోవచ్చు.

రాహుల్‌.. ప్రియాంక.. రేవంత్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ తదితరులు పార్టీ విజయం కోసం ప్రచారాల్లో పా ల్గొన్నారు. రాహుల్‌ గాంధీ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టే డియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చే శారు. ప్రియాంకా గాంధీ తాండూరు, పటాన్‌చెరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు.

కేసీఆర్‌, కేటీఆర్‌..

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సుయాత్రతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. ఇలా ఎవరికి వారుగా అన్ని పార్టీల హేమాహేమీల ప్రచారాలకు ప్రజలు హాజరైనప్పటికీ, ఎవరికి ఓట్లేస్తారో చెప్పే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్‌, బీజేపీల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలోనేతలు వచ్చినా ఆ ప్రభావం పోలింగ్‌లో కనిపించకపోవడం తెలిసిందే.

గతానికి భిన్నంగా అంశాల ప్రస్తావన

Advertisement
 
Advertisement
 
Advertisement