స్ట్రాంగ్‌రూమ్‌కు పోస్టల్‌ బ్యాలెట్లు | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూమ్‌కు పోస్టల్‌ బ్యాలెట్లు

Published Fri, May 17 2024 4:35 AM

-

పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల పోస్టల్‌ బ్యాలెట్‌లను గురువారం పార్వతీపురం తరలించారు. అక్కడి డా.వైఎస్సార్‌ ఉద్యాన కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో భద్రపరిచారు. అరకు పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ సహాయ రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎస్‌.ఎస్‌.శోభిక, పాలకొండ, సాలూరు, కురు పాం, పార్వతీపురం శాసనసభ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు సి.విష్ణుచరణ్‌, శుభం బన్సా ల్‌, వి.వి.రమణ, కె.హేమలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement