వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..? | What Are The Health Benefits Of Eating Amla In Summer, All You Need To Know About Gooseberry | Sakshi
Sakshi News home page

Eating Amla In Summer: వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?

Published Fri, May 3 2024 1:26 PM

Should You Eat Amla In Summer What Are The Benefits

ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయో తెలిసిందే. అయితే దీన్ని వేసవిలో తీసుకోవచ్చా. తింటే మంచిదేనా..? అని చాలామందికి ఎదురయ్యే సందేహం. ఆయుర్వేదం పరంగా ఔషధంగా ఉపయోగించే ఈ ఉసిరిని వేసవిలో తీసుకోవచ్చా అంటే..నిపుణులు బేషుగ్గా తీసుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్‌ హీట్‌కి సరైన ఫ్రూట్‌ అని చెబుతున్నారు. వేసవిలో ఉసిరి తీసుకోవడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందామా..!

వేసవిలో అందరూ ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్‌. దీని కారణంగా జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు. వాటికి చెక్‌పెట్టడంలో ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమ్మర్‌ హీట్‌ని తట్టుకునేలా రోగనిరోధక శక్తినిపెంచి, పొట్టలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక విటమిన్‌ సీ కంటెంట్‌ ఫ్రీ రాడికల్స్‌గా పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టాన్ని అరికడుతుంది. 

అలాగే శరీర కణాలు, కణాజాలా ఆరోగ్యకరమైన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరి హీట్‌ స్ట్రోక్‌, డీహైడ్రేషన్‌ వంటి ఉష్ణ సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. శరీరానికి చలువ చేస్తోంది. ఇది హైడ్రేట్‌గా ఉంచడంతో అంతర్గత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా చాలా నీరు చెమట రూపంలో వెళ్లినా.. శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ కూడా ఎక్కువే. 

అందువల్ల జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన గట్‌ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలు వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకునేలా చేస్తుంది. కొలస్ట్రాల్‌కి చెక్‌పెడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఎల్‌డీఎల్‌ లేదా చెడు కొలస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. 

అలాగే ఇది ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్‌లు చర్మాన్ని యూవీ రేడియేషన్‌, పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేసి ముఖంపై పడే ముడతలను నివారిస్తుంది. అందువల్ల సమ్మర్‌లో ఎండ వేడిని తట్టుకోవడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని, తప్పక తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

(చదవండి: కే బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ కూతురు!)

 


 

Advertisement
 
Advertisement
 
Advertisement