Watch: Anchor Udaya Bhanu Shares Her Home Tour Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Udaya Bhanu Home Tour Video: యాంకర్‌ ఉదయభాను కొత్తింటిని చూశారా? హోంటూర్‌ రిలీజ్‌

Published Sun, Apr 30 2023 1:49 PM

Anchor Udaya Bhanu Shares Her Home Tour Video - Sakshi

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ఉదయ భానుది సెపరేట్‌ స్టైల్‌. ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణించిన ఉదయభాను బుల్లితెర శ్రీదేవిగా పాపులర్‌ అయ్యింది. అచ్చమైన తెలుగులో గలగలా మాట్లాడే  ఉదయ భాను యాంకరింగ్‌కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్‌గానూ ఉదయభానుకు పేరుంది. చదవండి: సోషల్‌ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక 

హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. దీనికి తోడు తనదైన స్టైల్‌లో హోస్టింగ్‌ చేసే ఉదయభాను బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరించింది. అయితే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక మాత్రం కనుమరుగైపోయింది. ఈమధ్యే మళ్లీ యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చి ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, షోలు చేస్తుంది.

సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది. తాజాగా కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉదయభాను దీనికి సంబంధించిన హోంటూర్‌ వీడియోను పంచుకుంది. విశాలవంతమైన గదులతో రిచ్‌ లుక్‌లో ఇల్లు అదిరిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఉదయభానుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: భర్తను తలుచుకొని ఎమోషనల్‌ అయిన సురేఖ వాణి 

Advertisement
 
Advertisement
 
Advertisement