గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు! | Sakshi
Sakshi News home page

గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు!

Published Thu, May 2 2024 7:01 AM

Singer Sidhu Moosewala Mastermind Goldy Brar Shoot In US

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ హత్యపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతను బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని హోల్ట్‌అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో  కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారు.

కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్‌ కాదని  లెఫ్టినెంట్‌ విలియం జే డూలే అని పోలీసులు వెల్లడించారు. మీరు మృతుడు గోల్డీబ్రార్‌ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్‌ గాల్డ్ అని తెలిపారు.

కాగా.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్‌ పేరు తెరపైకొచ్చింది. ఈ కేసులో  అరెస్టైన నిందితుల్లో పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా హత్య కేసుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. 

Advertisement
Advertisement