విజయ మనదే.. ధీమాగా ఉండండి | Sakshi
Sakshi News home page

విజయ మనదే.. ధీమాగా ఉండండి

Published Thu, May 16 2024 6:10 PM

విజయ మనదే.. ధీమాగా ఉండండి

పామూరు: కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉండాలని, తాను అన్నివేళలా అండగా ఉంటానని ఆ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ దద్దాల నారాయణయాదవ్‌ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత సోమవారం కంబాలదిన్నె గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన దమ్ము శ్రీనివాసులు, యాదాల అలివేలమ్మను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై టీడీపీ నేతల దాడులు హేయమన్నారు. దాడికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అనంతరం మండల కేంద్రమైన పామూరులోని మిరియం రామారావు, గుంటుపల్లె సుబ్బరాయుడు నివాసాలకు వెళ్లి వారితో చర్చించారు. అదేవిధంగా పోలింగ్‌ సరళి, ఇతర అంశాలపై పార్టీ నాయకులతో చర్చించారు. ఆయన వెంట జెడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, కందుల శ్రీనివాసరెడ్డి, అంబటి కొండారెడ్డి, జె.గోవిందయ్య, నీలం వెంకటేశ్వర్లు, రమణమ్మ, రమణయ్య, నక్కా మాల్యాద్రి, కొల్లా రమణయ్య, గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి, గుడిమెట్ల వేణుగోపాల్‌ ఉన్నారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు దద్దాల పరామర్శ

Advertisement
 
Advertisement
 
Advertisement