రాజ‌స్తాన్‌తో ఢిల్లీ కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ | Sakshi
Sakshi News home page

RR vs DC: రాజ‌స్తాన్‌తో ఢిల్లీ కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ

Published Tue, May 7 2024 7:43 PM

Rajasthan Royals opt to field against Delhi Capitals

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క పోర‌కు సిద్ద‌మైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో రెండు మార్పులు చేశాయి.  రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయ‌నున్నారు. 

అదే విధంగా ఈమ్యాచ్‌కు రాజ‌స్తాన్ స్టార్ క్రికెట‌ర్లు ధ్రువ్ జురెల్‌, హెట్‌మైర్ దూర‌మ‌య్యారు. హెట్‌మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్‌లో శుబమ్‌ దూబే వ‌చ్చాడు. మ‌రోవైపు ఢిల్లీ జట్టులోకి వెట‌ర‌న్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్‌), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Advertisement
 
Advertisement
 
Advertisement