TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. | Sakshi
Sakshi News home page

TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల..

Published Thu, May 16 2024 7:52 PM

TS TET Hall Tickets out Direct Link

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వాస్త‌వానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఒక రోజు ఆల‌స్య‌మైంది. అభ్యర్థులు తమ జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా టెట్‌ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జూన్‌ 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.  ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ ఫలితాలు జూన్‌ 12న విడుదలయ్యే అవకాశం ఉంది.

హాల్‌ టికె ట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement