DRDO: స్వదేశీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం | Sakshi
Sakshi News home page

DRDO: స్వదేశీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Fri, Apr 19 2024 5:27 AM

DRDO successfully test fires indigenous long range subsonic cruise missile - Sakshi

భువనేశ్వర్‌(ఒడిశా): దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్‌ టెక్నాలజీ క్రూయిజ్‌ మిస్సైల్‌(ఐటీసీఎం)ను గురువారం ఒడిశా తీరంలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇందులో ఉపవ్యవస్థలను అంచనాల మేరకు పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది.

క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరును అంచనా వేసినట్లు పేర్కొంది. దీంతోపాటు, వాయుసేనకు చెందిన ఎస్‌యూ–30 ఎంకే–ఐ విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరును అంచనా వేసినట్లు డీఆర్‌డీవో వివరించింది.

Advertisement
Advertisement