ఓటర్ల అవస్థలు | Sakshi
Sakshi News home page

ఓటర్ల అవస్థలు

Published Tue, May 14 2024 3:10 PM

ఓటర్ల

మొరాయించిన ఈవీఎంలు

అల్లిపూర్‌లో గంట వరకు ఆగిన పోలింగ్‌

క్యూలైన్‌లో నిరీక్షించిన

వృద్ధులు, మహిళలు

ధారూరు: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అల్లిపూర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గంటపాటు పోలింగ్‌ నిలిచిపోయింది. కంట్రోల్‌, బ్యాలెట్‌ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్‌(ఈవీఎం)లు ఒక్కసారిగా మొరాయించాయి. మధ్యాహ్నం 3:10 గంటలకు ఆగిన వీటిని సరిచేయడానికి టెక్నికల్‌ సిబ్బంది అరగంట పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్టోరియల్‌ ఆఫీసర్‌ శర్బలింగం తన వాహనంలో సీయూ, బీయూ, వీవీ ప్యాట్‌లను తీసుకురాగా టెక్నికల్‌ సిబ్బంది అమర్చి సాయంత్రం 4:10 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించిన తర్వాత ఓటర్లకు అవకాశం కల్పించారు. పోలింగ్‌ ఆగిన విషయాన్ని తెలుసుకున్న ధారూరు సర్కిల్‌ సీఐ రామకృష్ణ, తహసీల్దార్‌ సాజిదాబేగం అల్లిపూర్‌ చేరుకుని పోలింగ్‌ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ప్రత్యేక పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరూ గుమిగూడకుండా బందోబస్తు చేశారు. కాగా మొరాయించిన కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లను ప్యాక్‌చేసి సీల్‌ వేశారు. వీటిలో పడిన ఓట్లు ఎక్కడికీ పోవని, మీరు వేస్తున్న మిగిలిన ఓట్లు రెండో ఈవీఎంలో నిక్షిప్తమవుతాయని సెక్టోరియల్‌ ఆఫీసర్‌ శర్బలింగం ఓటర్లకు వివరించారు.

గంటపాటు నిరీక్షణ

కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లు మొరాయించడంతో ఓట్లు వేయడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు గంటపాటు నిరీక్షించారు. మిషన్లు మొరాయించాయని తెలుసుకున్న ఇతర గ్రామస్తులు ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ బూత్‌లో మొత్తం 956 ఓట్లు ఉండగా 3:10 గంటల వరకు 631 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ గంటపాటు నిలిచిపోయినందున మరో గంట అదనపు సమయం కేటాయించాలని ఓటర్లు సెక్టోరియల్‌ ఆఫీసర్‌ శర్బలింగాన్ని కోరారు. అదనపు సమయం కేటాయించేందుకు వీలుండదదని సాయంత్రం 6 గంటల వరకు ఎంతమంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌ ఆవరణలోకి ఉంటారో వారందరూ ఓట్లు వేసేలా చూస్తామని నచ్చజెప్పారు.

నాగసమందర్‌లో..

మండల పరిధిలోని నాగసమందర్‌లోని ఓ బూత్‌లో బ్యాలెట్‌ యూనిట్‌ సమస్యరావడంతో 10 నిమిషాల పాటు ఓటింగ్‌ ఆగిపోయింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు బ్యాలెట్‌ యూనిట్‌ బటన్‌ నొక్కి పట్టడంతో అది తిరిగి పైకి రాలేదు. టెక్నీషియన్లు దానిని సరిచేయడానికి 10 నిమిషాల సమయం తీసుకున్నారు. అనంతరం ఓటింగ్‌ ప్రారంభమైంది.

ఓటర్ల అవస్థలు
1/2

ఓటర్ల అవస్థలు

ఓటర్ల అవస్థలు
2/2

ఓటర్ల అవస్థలు

Advertisement
 
Advertisement
 
Advertisement