అపురూపం.. చరిత్రకు సాక్ష్యం | Sakshi
Sakshi News home page

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

Published Sat, May 18 2024 7:10 AM

అపురూ

● ఏయూ సైన్స్‌, ఆర్ట్స్‌ కళాశాలల పరిధిలో మ్యూజియంలు ● విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించే కేంద్రాలు ● నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం

ఏయూక్యాంపస్‌: కళా ఖండాలు.. చారిత్రక వస్తువులు.. శాసీ్త్రయ నమూనాల వంటి వస్తువులను సేకరించి ప్రదర్శించే ప్రదేశం మ్యూజియం. ప్రజలు తిలకించడానికి, అధ్యయనం చేయడానికి ఇక్కడ కళాఖండాలు అందుబాటులో ఉంటాయి. నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం. మ్యూజియంలు సమాజానికి ఎలా దోహదపడతాయనే దాని గురించి అవగాహన కల్పించడం, సాంస్కృతిక మార్పిడి, వైవిధ్యం, సమగ్రతను ప్రోత్సహించడం ఈ డే ఉద్దేశం. ఈ సందర్భంగా ఏయూ సైన్స్‌, ఆర్ట్స్‌ కళాశాలల పరిధిలోని పలు మ్యూజియం విశేషాలు తెలుసుకుందాం.

● ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని ప్రధానమైన విభాగాల్లోని వృక్షశాస్త్రం ఒకటి. ఈ విభాగానికి సంబంధించి మ్యూజియం, హెర్బేరియం ఉన్నాయి. సహజంగా ఉండే మొక్కలు, విత్తనాలు ఫార్మా డీహైల్డ్‌లో భద్రపరిచి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇక్కడ 500లకు పైగా సముద్ర తీరం, సముద్ర అడుగు భాగంలో లభించే మొక్కలు, నేలపై లభించే మొక్కలు, విత్తనాలు వంటివి విద్యార్థుల కోసం భద్రపరిచారు. వీటితో పాటు వివిధ జాతుల అరుదైన చెక్కలు, వృక్ష శిలాజాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే హెర్బేరియంలో 25 వేలకు పైగా నమూనాలు ఉన్నాయి.

● ఏయూలోని జీవశాస్త్ర విభాగంలోని మ్యూజియంలో సుమారు 1,500లకు పైగా జీవులకు సంబంధించిన నమూనాలు ఉన్నాయి. చిరుత, జింక, తాబేలు, పక్షులు, పాములు ఇలా అనేక జీవుల కళేబరాలను టాక్సీ డమ్మీ విధానంలో ప్రత్యేక రసాయనాలు ఉపయోగించి ఇక్కడ భద్రపరిచారు. నేలపై, నీటిలో, గాలిలో సంచరించే అన్ని జీవుల కళేబరాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. అరుదైన, అంతరించే జీవులను కూడా ఇక్కడ మనం చూసే అవకాశం ఉంది.

● ఆర్ట్స్‌ కళాశాల పరిధిలోని ఆంత్రోపాలజీ విభాగంలో ప్రత్యేకంగా మ్యూజియం ఉంది. మానవ పరిణామ క్రమాన్ని వివరించడం, ప్రజల జీవనం తెలిపే విధంగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. ప్రాచీన కాలంలో ఉపయోగించిన పనిముట్లు, వారి సంస్కృతి, కళలు, జీవన విధానం, అలంకరణ వస్తువులు వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటీవల ఏయూను సందర్శించిన నాక్‌ నిపుణుల బృందం సైతం వీటిని పరిశీలించి ప్రశంసించింది.

● గత చరిత్రను మన ముందుంచే విధంగా చరిత్ర విభాగంలో మ్యూజియం ఉంది. ఇక్కడ చారిత్రక నాణేలు, ఇనుప రేకులపై రాసిన శాసనాలు, చారిత్రక శిలలు, శిల్పాలు, చారిత్రక ఆనవాళ్లుగా నిలిచే అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. భారతీయ ఆలయాలు, శిల్ప సంస్కృతులను తెలిపే చిత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తా యి. కాగా.. చారిత్రక సంపదను చెక్కు చెదరకుండా భద్రపరచడం ఎంతో క్లిష్ణమైన అంశం. ఈ విషయంలో ఏయూ అధికారులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. శతాబ్దానికి చేరువవుతున్న ఏయూకు ఈ మ్యూజియంలు అదనపు ఆభరణాలు.

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
1/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
2/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
3/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
4/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
5/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
6/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
7/7

అపురూపం.. చరిత్రకు సాక్ష్యం

Advertisement
 
Advertisement
 
Advertisement