No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 17 2024 8:00 AM

-

ఒంగోలు సెంట్రల్‌: జగనన్న విద్యాదీవెన పథకం 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలకు ముందే ఈ నిధులు తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఆ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టా రు. కానీ, టీడీపీ కూటమి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిధులు జమకాకుండా అడ్డుకుంది. కోర్టులకు సైతం వెళ్లినా నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ కుట్రల వలన ఆగిన ఈ పథకం నిధులను ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని సీఎం జగన్‌ బహిరంగ సభలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 47,422 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు 42,797 మంది బ్యాంక్‌ ఖాతాలకు రూ.36.44 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వీరంతా డిగ్రీ, పీజీతో పాటు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం, సాధికారత నోడల్‌ అధికారి ఎన్‌.లక్ష్మానాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement