Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ,

    ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 98 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. 

    ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్న‌ట్లే. కేకేఆర్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో 16.1 ఓవర్లలో 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 

    కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా మూడు వికెట్ల ప‌డ‌గొట్ట‌గా.. ర‌స్సెల్ రెండు, స్టార్క్‌, న‌రైన్ చెరో వికెట్ సాధించారు. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్‌(36) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌దర్శ‌న చేయ‌లేక‌పోయారు.

    ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. 

    అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.
     

  • ,

    ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగ‌ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా కీల‌క పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను జ‌డ్డూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వ‌రిచింది.

    ఈ క్ర‌మంలో జ‌డేజా ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌పున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆట‌గాడిగా జ‌డ్డూ నిలిచాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డుల‌ను గెలుచుకున్నాడు.

    ఇంత‌కుముందు ఈ రికార్డు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును జ‌డేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మ‌రో రికార్డును జడ్డూ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 40 పైగా ప‌రుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌, షేన్ వాట్స‌న్ స‌ర‌స‌న జ‌డేజా చేరాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్స‌న్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశారు.

  • ,

    ఐపీఎల్‌-2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. ఈ విజ‌యంతో సీఎస్‌కే పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్‌కే విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కీల‌క పాత్ర పోషించాడు. 

    తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఈ విజ‌యంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్‌ కొనియాడాడు. 

    "ధర్మశాల వికెట్‌ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే మా స్కోర్‌ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్‌ వస్తే చాలు అని భావించాము. 

    మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్‌ను మేము డిఫెండ్‌ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్‌జీత్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో తను తొలి మ్యాచ్‌ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు. 

    అతడు గత సీజన్‌లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్‌ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటర్‌గా దించాలనుకున్నాము. బ్యాటర్‌ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము. 

    కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్‌జీత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు.

     మ్యాచ్‌ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్‌కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు.

  • ఐపీఎల్‌-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.

     

  • టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘ‌నత సాధించాడు. ఇండియన్ ప్రీమియ‌ర్‌(ఐపీఎల్‌)లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జితేష్ శర్మ క్యాచ్‌ను ప‌ట్టిన ధోని.. ఈ అరుదైన ఫీట్‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    ఐపీఎల్‌లో ధోని ఖాతాలో ఇప్ప‌టివ‌ర‌కు 141 క్యాచ్‌ల‌తో పాటు 42 స్టంపింగ్‌లు కూడా ఉన్నాయి. ఈ ఘ‌న‌త సాధించిన జాబితాలో ధోని త‌ర్వాత ఆర్సీబీ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు.  కార్తీక్ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో  141 క్యాచ్‌లు అందుకున్నాడు. 

    ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్‌కే 28 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది.  సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా 43 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(32), డార్లీ మిచెల్(30) ప‌రుగులు చేశాడు. 

    పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, రాహుల్ చాహ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం 168 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌.. చెన్నై బౌల‌ర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

    పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో రవీంద్ర జ‌డేజా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. 

  • ఐపీఎల్‌-2024లో మ‌రో కీల‌క స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. 

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ల‌క్నో యువ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో య‌ష్ ఠాకూర్ వ‌చ్చాడు. మ‌రోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది .

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

    లక్నో సూపర్ జెయింట్స్:  కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
     

  • ,

    ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే  ఘ‌న విజ‌యం సాధించింది. 

    168 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌.. చెన్నై బౌల‌ర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 

    మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌య్యారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో రవీంద్ర జ‌డేజా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. 

    అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన‌ సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. బ్యాటింగ్‌లోనూ ర‌వీంద్ర జ‌డేజా స‌త్తాచాటాడు. 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 

    అత‌డితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(32), డార్లీ మిచెల్(30) ప‌రుగులు చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, రాహుల్ చాహ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

  • ,

    ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరమయ్యాడు.

    పతిరానా ప్రస్తుతం  తొడ కండ‌రాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ధ్రువీకరించింది.

    టీ20 వరల్డ్‌కప్‌ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్‌ స్వదేశానికి రప్పించింది.

    ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే త‌రుపున ప‌తిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకాన‌మీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ సైతం ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

    ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్‌కేకు నిజంగా బిగ్‌ షాక్‌ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. 
     

  • ,

    ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

    సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా 43 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(32), డార్లీ మిచెల్(30) ప‌రుగులు చేశాడు. మ‌రోవైపు పంజాబ్ బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

    పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, రాహుల్ చాహ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

  • ,

    ఐపీఎల్‌-2024లో టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ శివమ్‌ దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ లీగ్‌ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. సెకెండ్‌ హాఫ్‌లో మాత్రం తన మార్క్‌ చూపించలేకపోతున్నాడు. 

    ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూబే గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 

    దూబే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్‌ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.  

    స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్‌లో ఔట్‌ అవుతుండడం సీఎస్‌కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.

     

  • చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను టాస్‌ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏకంగా పదింట టాస్‌ ఓడాడు. పంజాబ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టాస్‌ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.

    టాస్‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్‌ ప్రాక్టీస్‌) తీసుకుంటున్నా రుతురాజ్‌ వరుసగా టాస్‌ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన రుతు ఓ ఆల్‌ టైమ్‌ చెత్త రికార్డును సమం చేశాడు.

    ఐపీఎల్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్‌ ఓడాడు. రాజస్థాన్‌, సీఎస్‌కే తర్వాత తొలి 11 మ్యాచ్‌ల అనంతరం అత్యధిక సార్లు టాస్‌ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ముంబై 2011 సీజన్‌లో తొమ్మిదింట టాస్‌ ఓడింది. 2013 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా తొలి 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట టాస్‌ ఓడింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే తొలి 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్‌ కాగా.. రుతురాజ్‌ (25), డారిల్‌ మిచెల్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.

    తుది జట్లు..

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే


     

  • ఐపీఎల్‌లో ఇవాళ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం సీఎస్‌కే ఒక మార్పు చేయగా.. పంజాబ్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది. సీఎస్‌కే జట్టులో స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ స్థానంలో మిచెల్‌ సాంట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే

    సీఎస్‌కేకు చాలా కీలకం..
    ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 

    ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్‌, 12న రాజస్థాన్‌ రాయల్స్‌, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.

    పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. 

    టెక్నికల్‌గా పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్‌.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్‌ రాయల్స్‌ (మే 15), సన్‌రైజర్స్‌ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.

    హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 15, పంజాబ్‌ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్‌లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

     



     

  • మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఎడిషన్‌ ఫిక్చర్లు, గ్రూప్‌ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్‌ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్‌ 3న జరిగే ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి.

    గ్రూప్‌-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్‌, పాక్‌లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌-1 ఉండగా.. గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, క్వాలిఫయర్‌-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్‌ల్లోని జట్లు తమతమ గ్రూప్‌ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్‌ ఆడతాయి. 

    గ్రూప్‌ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 20న ఫైనల్‌ జరుగుతుంది. రెండు సెమీస్‌లకు, ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేస్‌ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్‌ మైదానాల్లో జరుగనుంది. 

    ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిక్చర్స్‌ లాంచింగ్‌ ప్రోగ్రాంను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, బంగ్లా కెప్టెన్‌ నిగర్‌ సుల్తాన్‌ ప్రారంభించారు.

    దాయాదుల సమరం ఎప్పుడంటే.. 
    పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సిల్హెట్‌ మైదానం వేదిక కానుంది. భారత్‌ మ్యాచ్‌లు అక్లోబర్‌ 4 (న్యూజిలాండ్‌), 9 (క్వాలిఫయర్‌-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.

    మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా ఆసీస్‌..
    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్‌ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్‌ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్‌లో ఇంగ్లండ్‌.. 2016 ఎడిషన్‌లో వెస్టిండీస్‌ విజేతలుగా నిలిచాయి. 

    2016 ఎడిషన్‌లోనూ ఆసీస్‌ ఫైనల్‌ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్‌ ఆసీస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆసీస్‌ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్‌ 2020లో ఫైనల్‌ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. 

  • ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్‌లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్‌గా, తొలి సౌతాఫ్రికన్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

    టీ20 కెరీర్‌లో 369 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌.. 134.30 స్ట్రయిక్‌రేట్‌తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 

    గేల్‌ 463 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్‌ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్‌ తర్వాతి స్థానాల్లో షోయబ్‌ మాలిక్‌ (13360), పోలార్డ్‌ (12900), విరాట్‌ కోహ్లి (12536), అలెక్స్‌ హేల్స్‌ (12319), వార్నర్‌ (12232), రోహిత్‌ శర్మ (11482), జోస్‌ బట్లర్‌ (11465), ఆరోన్‌ ఫించ్‌ (11458), కొలిన్‌ మున్రో (10961), బాబర్‌ ఆజమ్‌ (10620), జేమ్స్‌ విన్స్‌ (10451), డేవిడ్‌ మిల్లర్‌ (10230), డుప్లెసిస్‌ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్‌ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్‌ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్‌కేకు ఆడిన డుప్లెసిస్‌ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. డుప్లెసిస్‌ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. 

    గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో షారుక్‌ ఖాన్‌ (37), డేవిడ్‌ మిల్లర్‌ (30), రాహుల్‌ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌కుమార్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్‌ శర్మ, గ్రీన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్‌ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. 

    అయితే దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌).. సప్నిల్‌ సింగ్‌ (15 నాటౌట్‌) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్‌ బౌలర్లలో జాషువ లిటిల్‌ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్‌ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఈ సీజన్‌లో అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

    అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ఈ సీజన్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.

    వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..
    ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్‌ సింగ్‌ అనే పంజాబ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్‌లో శశాంక్‌ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 

    శశాంక్‌ను ఈ సీజన్‌ వేలంలో పంజాబ్‌ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్‌ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్‌ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

    ఈ సీజన్‌లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌. ప్రభ్‌సిమ్రన్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. 

    అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్‌ ఈ సీజన్‌ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్‌ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్‌క్యాప్డ్‌ బ్యాటర్లు  ఈ సీజన్‌లో ఇరగదీస్తున్నారు.

    బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్‌ పేసర్‌ నటరాజన్‌ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్‌ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. 

    అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌, సందీప్‌ శర్మ, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు.

     

     

     

Movies

  • సినిమాల్లో నటించి హిట్స్ కొట్టినా సరే కొందరు యాక్టర్స్ కనుమరుగైపోతుంటారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా కనిపించకుండా పోతుంటారు. ఈ బ్యూటీ సేమ్ అలానే. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఒక్క భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

    (ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

    పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య నగేశ్. తమిళనాడుకి చెందిన ఈమె.. 'అపరిచితుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'అరుంధతి'లో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. వీటితో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

    రీసెంట్‌గా తమిళంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దివ్య నగేశ్.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈమెని బాలనటిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన దివ్యని చూసి షాకవుతున్నారు. ఇద్దరూ ఒకరేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. మరి మీరేమైనా గుర్తుపట్టారా?

    (ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

  • టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈయన అభిమానులు, పలువురు నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

    యూకేకి చెందిన బెర్నార్డ్ హిల్.. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాలైన 'టైటానిక్'లో షిప్ కెప్టెన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు.

    (ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

  • ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?

    హీరోయిన్‌గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

    తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ‍్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి  ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.

    అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

  • సురేఖావాణి కూతురు సుప్రీత అందాల జాతర

    చీరకట్టులో ఎక్స్‌ట్రా క్యూట్‌గా నయని పావని

    గ్లామర్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్

    లేటు వయసులోనే ఆ రేంజ్ హాట్‌గా శ్రియ

    చీరలో సంప్రదాయంగా 'గుంటూరు కారం' మీనాక్షి

    మత్తెక్కించేలా చూస్తూ రెచ్చగొడుతున్న అనుకృతి

  • అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.

    (ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

    అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

    ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

  • ప్రముఖ నటుడి భార్య మోసపోయింది. తెలిసి తెలిసి లక్షల రూపాయలు పోగొట్టేసుకుంది. అయితే కొన్ని నెలల ముందు భర్త ఇలానే మోసపోగా.. ఇప్పుడు అతడి భార్యకు ఇలానే జరిగింది. అయితే తెలిసి మరీ ఇలా జరగడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు? అసలేం జరిగింది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

    బాలీవుడ్‌లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్ బేడీ.. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాకేశ్‌కి చెందిన ఫ్లాట్ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్‌లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు.

    ఇప్పుడు నటుడు రాకేశ్ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.

    (ఇదీ చదవండి: నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్‌)

  • ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు.

    కొచ్చిలోని ప్రముఖ హోటల్‌లో మాళవిక-నవనీత్‌ రిసెప్షన్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

  • కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్‌ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.

    చాలా కాలం తర్వాత ఈ సీనియర్‌ నటి బాక్‌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.

    ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్‌ కమెడిన్‌ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్‌, ఒక బ్రదర్‌ ఉన్నాడు. 

    అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్‌ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్‌ కొడుతూ సందడి చేయాలి. 

    నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్‌ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్‌. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్‌ అయింది. 
     

  • జబర్దస్త్ కమెడియన్ రాజు యాదవ్, అంకిత కారత్ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. యధార్థం సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 
    తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గెటప్‌ శ్రీను తన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌ ప్రారంభంలోనే క్రికెట్‌ ఆడుతుండగా శ్రీనుకు బాల్ తగలడంతో ముఖచిత్రం మారిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా ఫేస్‌ విచిత్రంగా తయారవుతుంది. దీంతో అతని నవ్వుతో పడే ఇబ్బందులను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌గా గెటప్ శ్రీను కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్‌ విడుదల చేయగా.. ఆడియన్స్‌ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రంలో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.


     

  • తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

    హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.

    థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.

    (ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)

  • హీరోయిన్ క‌రీనా క‌పూర్ ఇప్పుడు యునిసెఫ్ (యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ ఎమర్జెన్సీ ఫండ్‌) జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌. ఈ అరుదైన ఘ‌న‌త అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలోని ఈవెంట్‌లో పిల్ల‌ల గురించి మాట్లాడింది. 'పిల్ల‌లు తండ్రి గురించే కాదు త‌ల్లి చేసే ప‌ని గురించి కూడా ఆలోచిస్తారు. 

    నీతో ఉండాల‌నుంద‌మ్మా
    అంతేకాదు అమ్మ‌ ఎప్పుడూ ఏదో ఒక ప‌నితో బిజీగా ఉంటోంద‌ని ఒకింత గౌర‌వ‌మిస్తారు. ఈ రోజు నా పిల్ల‌ల‌కు హాలీడే.. నేను కూడా వారితో క‌లిసుండాల‌ని కోరుకున్నారు. కానీ నాకు ప‌నుంద‌ని చెప్పి వ‌చ్చేశాను. పెద్ద‌బ్బాయి తైమూర్ అయితే.. నువ్వెప్పుడూ ప‌నీప‌నీ అంటూ ఢిల్లీ, దుబాయ్ వెళ్తూ ఉంటావు.. నాకు నీతో ఉండాల‌నుంద‌మ్మా అన్నాడు. మ‌న‌సు చివుక్కుమంది. ప‌ని కూడా ముఖ్య‌మైన‌దే కాబ‌ట్టి వెళ్ల‌క త‌ప్ప‌డం లేద‌ని చెప్పాను. 

    మాటిచ్చాను
    త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని, ఎక్కువ స‌మ‌యం త‌న‌తో గ‌డుపుతాన‌ని మాటిచ్చాను. అది నెర‌వేరుస్తాను కూడా.. అందుకే పిల్ల‌లు వాళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేసిన‌ట్లుగా భావించ‌రు. పేరెంట్స్ ఇద్ద‌రూ వ‌ర్క్ చేసుకుని ఇంటికి వ‌చ్చేస్తార‌ని తైమూర్‌ అర్థం చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ నుంచే కొన్ని ల‌క్ష‌ణాలు నేర్చుకుంటారు. 

    చివ‌గా సూపర్ హిట్ మూవీలో..
    సైఫ్ ఎప్పుడూ పిల్ల‌ల ముందు మ‌నం ప్రేమ‌గా, ఆప్యాయంగా మెద‌లాల‌ని, అంతే ప్రేమ‌గా మాట్లాడాల‌ని చెప్తుంటాడు. మ‌న‌ల్ని చూసే వాళ్లు నేర్చుకుంటార‌న్నాడు. అందుకే మాలాగే నా పిల్ల‌లిద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌర‌వంగా మెదులుతారు అని చెప్పుకొచ్చింది. క‌రీనా చివ‌ర‌గా క్రూ సినిమాలో క‌నిపించింది.  ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

    చ‌ద‌వండి: 'హీరోయిన్' సెట్‌లో అదృశ్యం.. స్నేహితులే శ‌రీరాన్ని ముక్క‌లు చేసి..!

  • బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్‌ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్‌పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్‌ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.

    చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్‌లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్‌లో ఓకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్‌ చేసిన బిగ్ మిస్టేక్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. 

    అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్‌కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ  సినిమాలో నటించింది. 

  • కరీనా క‌పూర్ హీరోయిన్‌గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్ర‌స్తావ‌న సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన న‌టి మీనాక్షి థాప‌ర్ గురించి! ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న ఆమెకు ఇదే చివ‌రి సినిమా! చిన్న వ‌య‌సులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్ర‌త్యేక క‌థ‌నం..

    సినిమా ఛాన్స్‌కు ముందు
    1984 అక్టోబ‌ర్ 4న మీనాక్షి థాప‌ర్ జ‌న్మించింది. డెహ్రాడూన్‌లో త‌న విద్యాభ్యాసం జ‌రిగింది. సినిమాల మీద ఆస‌క్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావ‌డానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్ర‌య‌త్నాల త‌ర్వాత‌ 2011లో 404 అనే హార‌ర్ సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ అవ‌లేదు.

    సెట్స్‌లో అదృశ్యం
    త‌ర్వాత మ‌ధుర్ భండార్క‌ర్ సినిమా 'హీరోయిన్‌'లో ఛాన్స్ వ‌చ్చింది. క‌రీనా క‌పూర్‌తో యాక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డిపోయింది. త్వ‌ర‌లోనే న‌టిగా గొప్ప స్థాయికి చేరుకోవ‌చ్చ‌ని భావించింది. అంత‌లోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్‌కి రాగా అక్క‌డే ఆమె అదృశ్య‌మైంది.  ఆమె ఎక్క‌డికి వెళ్లిందో ఎవ‌రికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న న‌టి త‌ల్లికి ఫోన్ కాల్ వ‌చ్చింది. 

    రూ.15 ల‌క్ష‌లు డిమాండ్‌
    అందులో మీనాక్షి మాట్లాడుతూ.. త‌న ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్‌, ప్రీతి సురిన్‌తో క‌లిసి  అల‌హాబాద్‌కు వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మూడు రోజుల త‌ర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి త‌ల్లికి ఒక మెసేజ్ వ‌చ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 ల‌క్ష‌లు పంపండి.. మూడు రోజులు మాత్ర‌మే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే త‌ను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంట‌ర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని బెదిరించారు. 

    రోజులు గ‌డుస్తున్నా
    ఈ బెదిరింపుల‌కు న‌టి త‌ల్లి లొంగ‌లేదు. ఆర్మీలో ప‌ని చేస్తున్న త‌న కుమారుడితో క‌లిసి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా పూస గుచ్చిన‌ట్లు చెప్పింది. రోజులు గ‌డుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొర‌క‌లేదు. ఒక‌రోజు అమిత్‌, ప్రీతి(వీరిద్ద‌రూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని ప‌ట్టుకుని విచారించ‌గా అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మీనాక్షిని హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించాడు.

    శ‌రీరాన్ని ముక్క‌లుగా
    ఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన స‌మాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన త‌ర్వా ఆమె త‌ల‌, మొండెం వేరు చేశారు. అల‌హాబాద్‌లో ప్రీతి ఇంటికి ద‌గ్గ‌ర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో త‌న శ‌రీరాన్ని ముక్క‌లుగా కోసి ప‌డేశారు.  త‌ల‌ను అలహాబాద్ నుంచి ల‌క్నోకు వెళ్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో బ‌స్సులో నుంచి అడ‌విలో విసిరేశారు. 2018లో న్యాయ‌స్థానంలో నిందితులిద్ద‌రికీ జీవిత ఖైదు విధించింది.

    స్నేహితుల అత్యాశ వ‌ల్ల‌ 27 ఏళ్ల వ‌య‌సుకే న‌టి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక త‌ల్లికి తీర‌ని క‌డుపుకోత మిగిలింది.

    చ‌ద‌వండి: సింగ‌ర్‌పై బాటిల్ విసిరిన ఆక‌తాయి.. అయినా స‌హ‌నం కోల్పోకుండా..

  • బాలీవుడ్‌లో మరో స్టార్‌ జంట బ్రేకప్‌ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్‌ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.

    గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ‍వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

    అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. 

     

  • ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్‌ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్‌ శంకర్, ఎంఆర్‌ శీనివాసన్, సుధాకర్‌ కలిసి ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

    అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్‌ జాన్‌ కిళడి(పైరీ), మణివర్మన్‌(ఒరునొడి), ఆర్‌.వెంకట్‌(కిడా), బాలాజీ వేణుగోపాల్‌ (లక్కీమేన్‌), కన్నుసామి(వట్టార్‌ వళక్కు), యశ్వంత్‌ కిశోర్‌ (కన్నగి), విఘ్నేశ్‌కార్తీక్‌( హార్ట్‌స్పార్ట్‌) శరత్‌ జ్యోతి, రచయిత వసంత్‌ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్‌ ముణుసామివీరప్పన్‌(వెబ్‌సిరీస్‌)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ భవిష్యత్‌లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్‌ మరో 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌ మొదటి ఎపిసోడ్‌ను, సెన్టెన్స్‌ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.  
     

Politics

  • బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.

    దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్‌ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్‌ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి.  

  • చండీగఢ్‌: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్‌ అని పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌​జిత్‌ సింగ్‌ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో  నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు.  

    ‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ  ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మృతి  చెందిన విషయం తెలిసిందే.

    అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ వాహనంపై  జరిగిన ఉగ్రదాడిలో  ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల  25న జరగనున్న అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్‌ ఉంది.

  • రాయ్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.

    తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌ నేత రాధికా ఖేరా కాంగ్రెస్‌ పార్టీకి,  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు పంపించారు.

    ‘‘అయోధ్యలోని రామమందిరం  సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్‌ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. 

    నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ,  కాంగ్రెస్‌ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్‌(ట్విటర్‌)లో హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

    ‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.

    తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

  • ఎంతమంది రౌడీలను పెట్టినా హీరో లొంగడం లేదు.. పైగా ఎగిరెగిరి తంతున్నాడు. వచ్చినవాళ్లు వచ్చినట్లే నేలకు కరుచుకుపోతున్నారు.. ఇక ఇలాక్కాదని రావుగోపాలరావుకు కోపం వచ్చింది. బొంబాయి నుంచి జిముంబా అనే పెద్ద దాదాను తీసుకొచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు.. పూటకు రెండు గొర్రెలు  వంద గుడ్లు తింటాడు. వాణ్ని ఎవరూ ఎదుర్కోలేరు. అలాంటివాణ్ణి హీరోమీదకు ఉసిగొల్పాడు.. మొదటి రెండు షాట్లు తిన్న హీరో ఇక లేచాడు. కళ్ళలో పడిన దుమ్మును దులిపేసి.. నడుముకు తువాలు చుట్టి జై భజరంగి భళి అంటూ గర్జించాడు.. ఎగిరెగిరి తన్నాడు.. దెబ్బకు జిముంబా కూడా నేల కరిచేసాడు.

    ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఇలాగే ఉన్నాయ్..  రావుగోపాలరావు పాత్రలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే హీరో జగన్ మీద రకరకాల వాళ్ళను ప్రయోగిస్తున్నారు... వలంటీర్ల మీద దుమ్ము రేపబోయాడు... అది ఎదురుతన్నింది... వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఆపించాలని చూసాడు... వృద్ధులతో తిట్లు కాసాడు.. ఇంగ్లిష్ మీడియం వద్దన్నాడు.. పేరెంట్స్ తో చీవాట్లు కాసాడు... ఇక ఇలా కాదని ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్... జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు... పత్రికలూ...మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు  ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు... ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు... జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి....సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు.

     చదవండి: కొత్త పగటివేషగాడు వచ్చాడు

    అసలు ఆ చట్టం ఆంటే ఏమిటి... దానిలోని లోటుపాట్లు...అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు... లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్.... లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు   హక్కులిచ్చాము... ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము...ఇదీ మీ జగన్ నిజాయితీ...ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ... అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్ను ఇదేనా అర్థం చేసుకున్నది... అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థం ఐంది.

    అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది... దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.

    దీంతో ప్రజలకు విషయం అర్థమైంది...అంతేకాకుండా ఆ అంశం ప్రజల మనస్సుల్లోంచి తొలగిపోతూ... జై జగన్ అనే నినాదం వచ్చి చేరుతోంది... దీంతో ఎల్లో మీడియా... చంద్రబాబు క్యాంప్ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.. ఎంతో ప్లాన్ చేసి ఈ టైట్లింగ్ చట్టం మీద గాయిగాత్తర చేయబోతే ఇలాగయ్యిందేంటిరా సాంబడా అంటూ తండ్రీకొడుకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.. మనం ఎంత పెద్ద కుట్రపన్నినా అటు జగన్ ఒక్క బాణంతో దాన్ని ఎఱుర్కొంటూనే తిరిగి ఆ వ్యూహం మనకు తగిలేలా చేస్తున్నాడు..ఇలాగైతే ఎలారా సాంబా అని  తండ్రీకొడుకులు కొత్త కుట్రలకు సిద్ధమవుతున్నారు... ఈసారి ఢిల్లీ కాకుండా బీహార్ నుంచి భిక్షు యాదవ్ ను తెచ్చేపనిలో ఉన్నారేమో... చూడాలి.

    :::: సిమ్మదిరప్పన్న

  • సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.

    ‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్‌ షాకు తెలుసు. కూటమిలో పార్ట్‌నర్‌ కాబట్టే అమిత్‌ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు?  కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. 

    పోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్‌కు ఉంది.  పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్‌ రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.

    ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై  తప్పుడు ప్రచారం..

    ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. 

    రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌  యాక్ట్‌  భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుంది

    తప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.

    టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జల

    ల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్

    పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

    చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని  మెచ్చుకున్న  పయ్యావుల

    2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావుల

    ఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి

     

    వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..

    • ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ
    • చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?
    • ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన  చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు
    • 2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చింది
    • ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడింది
    • ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్నారు
    • పయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కు మద్దతు తెలిపారు
    • చట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది
    • 5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.
    • టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు  ఎవరైనా ఉంటారా.?
    • వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.
    • రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలి
    • చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణ
    • టీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి
    • బిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్
    • రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .
    • సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.
    • పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.
    • దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది?
       

     

  • లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కీలకమైన ఆమేథీ పార్లమెంట్‌ స్థానంలో సస్పెన్స్‌కు తెరదించుతూ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్‌ శర్మను బరిలోకి దించింది. ఆయన ఎంపికపై బీజేపీ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించింది. 

    ఆమేథీలో కాంగ్రెస్‌ పార్టీ ఒక ‘ప్యూన్‌’ను పోటీకి దింపిందని ఎద్దేవా చేసింది. అయితే బీజేపీ విమర్శలకు ఆమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరి లాల్‌ శర్మ కౌంటర్ ఇచ్చారు. తాను గాంధీ కుటుంబానికి ‘సర్వెంట్‌’ను కాదు.. చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని అని బీజేనీ విమర్శలను తిప్పికొట్టారు.

    ‘ఆమేథి నియోజకవర్గంలో నా ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకుంది. నాకు టికెట్‌ ఇచ్చేవరకు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేయలేదు. టికెట్‌ రాకముందే నేను సిట్టింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీని ఓడిస్తానని ఎలా విశ్వాసం వ్యక్తం చేస్తాను.  ఇక్కడ పోటీ చేస్తున్న నేను గాంధీ కుటుంబానికి సర్వెంట్‌ను కాదు.. నేను చాలా ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని. నాకు ఇక్కడ కాంగ్రెస్‌తో 1983 నుంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో నేను వేతనం తీసుకునే ఉద్యోగి కాదు.. నేను ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని’ అని కిషోరి లాల్ శర్మ అన్నారు.

    ఆమేథీలో మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు కేరళలోని వాయ్‌నాడ్‌ సెగ్మెంట్‌ గెలిచారు రాహుల్‌ గాంధీ. అదే విధంగా ఈసారి​ కూడా రాహుల్‌ గాంధీ వాయ్‌నాడ్‌ బరిలో దిగగా.. అక్కడ పోలింగ్‌ పూర్తైంది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి కీలమైన ఆమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. ఆమేథీలో కిషోరి లాల్‌ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీని బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ రెండు స్థానాలో మే 20న పోలింగ్‌ జరగనుంది.

  • సాక్షి,హైదరాబాద్‌: చీరకట్టుకొని జూబ్లీహిల్స్‌లో బస్‌ ఎక్కి టికెట్‌ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో కేటీఆర్‌ ఆదివారం(మే5) ట్వీట్‌ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?

    తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.

    కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్‌ కిట్‌ బంద్‌ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్‌ రేవంత్‌కు చురకలంటించారు. 

  • ఢిల్లీ:  పాకిస్తాన్‌ మాజీ మంత్రి  ఫవాద్ హుస్సేన్  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రశంసలు కురిపించటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.  

    ‘‘ఇండియా కూటమిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ప్రతిపక్షాల కూటమి అసత్య ప్రచారం చేసి, ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని దుష్ప్రచారం చేస్తోంది.  కానీ, కాంగ్రెస్‌ పార్టీనే రాజ్యాంగాన్ని 85 సార్లు సవరించింది. రాజ్యాంగంలో పీఠికలో సైతం మార్పులు చేసింది. అలాంటిది ప్రస్తుతం బీజేపీని నిందిస్తోంది. బీజేపీ అధికారంలోకి  వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోదు’’అని  రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

    ‘‘పాకిస్తాన్‌ రాహుల్‌ గాంధీపై అంత ప్రేమ చూపించటం వెనుక భారత్‌ను అస్థిర పరచాలనే కుట్ర ఉంది. అసలు పాక్‌ మాజీ మంత్రి రాహుల్ గాంధీపై చూపిన ప్రేమ చాలా ఆందోళన కలిగించింది. దానికి గల బలమైన కారణాన్ని భారత్‌ తెలుసుకోవాలనుకుంటుంది. సంపద పంపిణీతో వెనుజులా దేశం వలే ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకుంటోంది. 

    ...ద్రవ్యోల్బణం పెంచాలని చూస్తోంది.  పాకిస్తాన్‌ భారత్‌లోని ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తోంది’’అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారత్ ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభావం చూపనుందా? అని అడిన ప్రశ్నకు బదులిస్తూ..  ఆ దేశానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు.  

    ఇక.. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఓ  వీడియోను ‘ఎక్స్‌’పోస్ట్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్‌ ఫైర్‌’అని క్యాప్షన్‌పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు  గుప్పించారు.

  • ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? 

    అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.

    వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. 

    దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్‌ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. 

    అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి  బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. 

    వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. 

    --సిమ్మాదిరప్పన్న--


     

  • కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు.

    అమేథీ నుంచి బరిలోకి దిగిన కేఎల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడిస్తానని అన్నారు. అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం. నేను స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం. ఇది నేను చేస్తున్న పెద్ద ప్రకటన అని శర్మ అన్నారు.

    1983లో యూత్ కాంగ్రెస్ ద్వారా నేను ఇక్కడకు వచ్చాను, నేను స్వచ్ఛమైన రాజకీయ నాయకుడినని కేఎల్ శర్మ అన్నారు. లూథియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ తర్వాత, అతను కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. కొంతకాలం తర్వాత, అతను రాయ్‌బరేలీ, అమేథీ రెండు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.

    గాంధీయేతర కుటుంబ సభ్యుడు అమేథీ నుంచి పోటీకి దిగడం బహుశా ఇది రెండోసారి అని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను ఆ స్థానానికి నియమించింది. 1970 మరియు 1990లలో కొన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయే వరకు అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది జూన్ 4న తెలుస్తుంది.

  • సాక్షి, నిర్మల్‌: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్‌లో కాంగ్రెస్‌ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్‌ గాంధీ.కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.

    కాంగ్రెస్‌ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం  ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్‌ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్‌లను తొలగించడమని చెప్పారు.

  • సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్‌ యాక్ట్‌పై ఇంకా రూల్స్‌ తయారు కాలేదన్నారు.

    ‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.

    ‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. 

    టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు.

  • సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్‌ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్‌ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్‌ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.

    ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

  • సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.

    ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.

    కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.

    ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.

    వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.

    ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది  

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

  • కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.

    కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. 

    ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.

    ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.

    -సిమ్మాదిరప్పన్న

  • సాక్షి, విజయవాడ: 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ? అంటూ ప్రశ్నించారు.

    ‘‘సభల్లో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు? బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?. నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. నాలుగేళ్లలో మోదీ ఏం చేశాడు? మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి?’’ అని రామకృష్ణ నిలదీశారు.

    ‘‘కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’’ అంటూ రామకృష్ణ మండిపడ్డారు.

     

     

     

  • సాక్షి ప్రతినిధి, కడప: వారంతా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనే క్రియాశీలక కార్యకర్తలు. ఎన్నికల సంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు, గుర్తింపు పొందిన పార్టీ అభ్యరి్థగా మరి కొందరు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కంటే మించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తతంగం పులివెందుల నియోజకవర్గంలో తెరపైకి వచ్చింది. కలిసికట్టుగా ఒకే వాహనంలో, ఒకే గ్రామంలో టీడీపీ కోసం ప్రచారం కొనసాగిస్తున్న ఉదంతమిది.  

    👉పులివెందుల టౌన్‌కు చెందిన అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తుగా పార మరియు స్టోకర్‌ రిటర్నింగ్ అధికారి కేటాయించారు. అయితే ఎక్కడా తన గుర్తు తెలియజేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించడం లేదు. పైగా టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి విజయం కోసం పనిచేస్తున్నారు. ఈనెల 3న అంబకపల్లి, మురారిచింతల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే బీటెక్‌ రవి కారుపై ఎస్కార్ట్‌ తరహాలో నిల్చొని గ్రామంలోకి ప్రవేశించారు. 

    అక్కడే ఉన్న బీటెక్‌ రవి సోదరుడు భరత్‌కుమార్‌రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈయనతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిరెడ్డి సంజీవరెడ్డి, గోకనపల్లె వరప్రసాదరెడ్డిలు కూడా టీడీపీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. సంజీవరెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవితో కలిసి స్వయంగా టీడీపీలో చేరికల్లో పాల్గొన్నారు. మురారిచింతల గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం సైతం కలిసికట్టుగా చేపట్టారు. గోకనపల్లె వరప్రసాదరెడ్డి ఏకంగా టీడీపీ టోపి పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేపట్టడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  


      

  • ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. 

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్‌ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. 

    ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ‌, జనసేన అధినేత పవన్‌‌ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్‌‌ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.

    మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ‌ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ‌ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ‌ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ‌ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

    ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ‌ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్‌డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్‌లను వ్యతిరేకించినట్లే అవుతుంది.

    వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం  నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.  చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. 

    మేనిఫెస్టోలో  వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.

    చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే  యత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్  సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.

    గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. 

    జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.

    ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో  అబద్దాలు రాస్తున్నారు. జగన్‌ తన  ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు  దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. 

    ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు  పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ  మరీ రాసుకున్నారు.

    చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ  రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్‌లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్‌, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. 

    ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ‌ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ‌ హామీగా ఉండబోరట. 

    బహుశా  ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై  గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ‌ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని  బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.

    – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు.

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేతలు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర తీశారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియా, చంద్రబాబుపు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే  ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒకరి పేరుతో ఉన్న భూమిని ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం సాధ్యమా?’ అని ప్రశ్నించారు. 

     

     

    అలాగే, ‘న’మ్మక’స్తుడైన రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ చౌదరి పార్టీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాడని టీడీపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబుకు తప్పుడు సలహా ఇచ్చి కొంపముంచాడని కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 67 లక్షల ఫించను లబ్దిదారులు, వాళ్ల కుటుంబసభ్యులను చేతులారా దూరం చేసుకున్నామని తలలు బాదుకుంటున్నారు. మరో వారంరోజుల్లో ప్రచారం ముగుస్తుండగా ఇప్పుడీ విషమ సమస్య నుంచి బయటపడేది ఎలాగా అని కుమిలిపోతున్నారు’ అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

     

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్‌ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్‌టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.

    ‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్‌ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్‌ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.

    ‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్‌ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్‌, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్‌ స్క్రిప్ట్‌ షర్మిల చదువుతుంది. వైఎస్‌ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.

    ‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్‌, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్‌ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్‌ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.
     

National

  • తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్‌మెంట్‌ బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్‌లోని తన గది తలుపు పెట్టుకుని బాత్‌రూమ్‌కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. 

    చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.  

  • బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.

    ‘ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూ కార్నర్‌  నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్‌ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్‌ రేవణ్ణ ఎక్కడ  ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్‌  ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్‌ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసు పంపాలని సిట్‌(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.

    ఇప్పటికే సిట్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణపై రెండుసార్లు లుక్‌ అవుట్‌ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్‌ తండ్రి హెడ్‌డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవి వైరల్‌ అయిన  అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

    బ్లూ కార్నర్‌ నోటీసులు అంటే?
    బ్లూ కార్నర్‌ నోటీసు ఇంటర్‌ పోల్‌  నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా  నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్‌, ఎల్లో, బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌, పర్పుల్‌. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి  సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్‌ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్‌’ నోటీసులు జారీ చేస్తారు.

  • ఖాట్మాండ్‌: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్వయంగా పంచుకున్నారు. 

    చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేపాల్‌ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్‌లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్‌లో పాల్గోని మాట్లాడారు. 

    ‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్‌లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్‌ నేర్చుకోవటంలో భాగంగా అసైన్‌మెంట్‌కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్‌ను  బతిమాలాడాను.  అయినా టీచర్‌ వినలేదు.

    బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.    

  • ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా  మధ్యప్రదేశ్‌లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్‌ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపేశారు.

    ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్‌ ఎస్సై  మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ప్రసాద్‌ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్‌ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే  ప్రాణాలు విడిచాడు.

    ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో  ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్‌ ఓనర్‌, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్‌ ఓనర్‌ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్‌ ఓనర్‌ కోసం గాలిస్తున్నారు.

    ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్‌ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు.  తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.

    దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో రాజ్‌గఢ్ ‍ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్‌ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్‌ చంద్‌ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. 

    కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని,  అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.

    మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. 

  • పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  

    బుందేల్‌ఖండ్‌లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్‌ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన  30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్‌ బాబా తెలిపారు.

    నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి.

  • దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.

    లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్‌ మార్కెట్‌ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై ​​కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై ​​రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.

    భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది.  సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్‌ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై ​​రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.

    ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు.

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఆదివారం(మే5) బదిలీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలని డీజీపిని ఆదేశించింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కు ఆదేశాలు జారీ చేసింది.  

    కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్‌ అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌ను ఈసీ కోరింది. సోమవారం(మే6) ఉదయం 11 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని కోరింది.  
     

  • సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్‌ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.    

    ఉదయం 10 గంటలకు  బాపట్ల  పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా  సెంటర్లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Family

  • ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!

    స్టార్‌ఫిష్‌లా  ఉండే పూలు
    నక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్‌ఫిష్‌ కాక్టస్‌ ఫ్లవర్స్‌ అని, స్టార్‌ ఫ్లవర్స్‌ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం. 

    కనిపెట్టిన మెషిన్‌ గన్‌తోనే
    అమెరికాలో జన్మించిన బ్రిటిష్‌ ఆవిష్కర్త హైరమ్‌ స్టీవన్‌ మాక్సిమ్‌ మొట్టమొదటి ఆటోమేటిక్‌ మెషిన్‌ గన్‌ను రూపొందించాడు. ఆ మెషిన్‌ గన్‌తో టెస్ట్‌ ఫైరింగ్‌ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్‌ పెర్సీ మాక్సిమ్‌ సైలెన్సర్‌ను కనిపెట్టాడు. 

    (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?)

  • చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్‌ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్‌ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్‌ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ‍ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.

    ఆమె పేరు క్విన్‌గ్యూ వాంగ్‌. గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్‌ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్‌ అయినట్లు చెప్పుకొచ్చింది. 

    తాను తొలిసారిగా 2018లో గూగుల్‌లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్‌లైన్‌ అసాస్‌మెంట్‌ (ఓఏ) రౌండ్‌లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్‌ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్‌ స్క్రీన్‌ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. 

    దీంతో సైట్‌ రిలయబిలిటీ ఇంజీనీర్‌ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్‌లో మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్‌ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్‌ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్‌ను కూడా అందుకుంది వాంగ్‌. ఎట్టకేలకు వాంగ్‌ ఐదో 
    ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. 

    అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్‌. ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి.

    (చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!)

     

     

     

  • చాలామంది కార్లను భలే మెయింటెయిన్‌ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్‌లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్‌లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్‌ అన్న​ ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.

    కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. 

    అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. 

    ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.

    (చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!)

     

  • ఉంగరం వేలు మన గుండె నరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మన పెద్దలు ఉంగరం వేలుకి ఉంగరం పెట్టేవారని మనం కథకథలుగా విన్నాం. అలాగే ఆయుర్వేదంలో కూడా వేళ్ల నరాలకు మన శరీరంలోని అవయవాలకు సంబంధం ఉందని చెబుతోంది. అయితే చైనా కంపెనీ ఆ ఉంగరంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉండేలా..సరికొత్త  స్మార్ట్‌ ఉంగరాన్ని తీసుకొచ్చింది.

    శరీరం పనితీరును, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ రింగ్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటి కోవలోనిదే ఈ స్మార్ట్‌ రింగ్‌. చైనీస్‌ కంపెనీ ‘అమాజ్‌ఫిట్‌’ ఇటీవల ఈ స్మార్ట్‌రింగ్‌ను ‘హీలియో రింగ్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. 

    ఇందులోని సెన్సర్లు ఎప్పటికప్పుడు శరీరం పనితీరును గమనిస్తూ స్మార్ట్‌వాచీ లేదా స్మార్ట్‌ఫోన్‌కు యాప్‌ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయి, గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, ఒత్తిడి, నిద్ర తీరు సహా పలు అంశాలపై ఈ ఉంగరం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసేవారికి ‘అమాజ్‌ఫిట్‌’ మూడు నెలల వరకు ‘జెప్‌ ఆరా’ హెల్త్‌ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌రింగ్‌ ధర 71 డాలర్లు (రూ.5,914) మాత్రమే! 

    (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?)
     

  • ఎన్నో రకాల రెసిపీలు గురించి విని ఉంటారు. అత్యంత వ్యవధి తీసుకున్న రెసీపీలు కూడా చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా కఠినమైన రెసిపీ గురించి మాత్రం విని ఉండదరు. అయితే దీనిని వేటితో తయారు చేస్తారో వింటే మాత్రం కంగుతింటారు. 

    ఏదో మాట వరసకు మంచి జీర్ణశక్తి గలవారిని రాళ్లను హరాయించుకోగలరు అంటారు గాని, ఎంతటి జీర్ణశక్తిమంతులకైనా ఈ వంటకాన్ని ఆరగించడం సవాలే! ‘సువోడియు’ అనే ఈ చైనీస్‌ వంటకంలోని ప్రధాన పదార్థం నది ఒడ్డున దొరికే నున్నని గులకరాళ్లే! గులకరాళ్లను మూకుడులో వేసి, బాగా వేయించి, వాటికి వెల్లుల్లి, మిరపకాయలు సహా రకరకాల మసాలాలు జోడించి తయారు చేస్తారు. 

    కాస్త జారుగా సూప్‌లా ఉండే ఈ వంటకాన్ని కొన్ని శతాబ్దాల కిందట నది మధ్యలో చిక్కుకుపోయిన ఓడ సరంగులు కనిపెట్టారట! ఈ వంటకంలోని సూప్‌లాంటి జారుడు ద్రవాన్ని జుర్రుకుని, ఇందులోని రాళ్లకు పట్టిన మసాలాలను నిదానంగా చప్పరించి, ఆనక ఆ రాళ్లను ఊసేయాలి. నిజానికి ఈ వంటకాన్ని ఆరగించడమే ఒక కళ! ‘సువోడియు’ చైనాలో చాలా చోట్ల వీథుల్లో అమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకంగా గుర్తింపు పొందింది. 

    (చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!)

  • ‘ఫాస్ట్‌ బీట్‌ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్‌జాన్‌ కాదిరోవ్‌. ‘చెచెన్‌ సంగీతం చెచెన్‌ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్‌కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్‌ బీట్‌ మ్యూజిక్‌ని రద్దుచేశారు.

    ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్‌కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.

    అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్‌ మరీ స్పీడ్‌గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్‌ మ్యూజిక్‌ లవర్స్‌.

    అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్‌ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్‌ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్‌కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్‌ నోట్స్‌ రాసుకోవడం.. రిహార్సల్స్‌.. రికార్డింగ్స్‌ ఎట్‌సెట్రాకు టైమ్‌ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్‌ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.

    ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!

  • హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్‌ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. 

    నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. 

    దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్‌! అనిపిస్తుంది.

     

    (చదవండి: టిష్యూ బ్రెడ్‌..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్‌)

     

  • కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్‌ చిన్‌  వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది  వి షేప్‌ ఫేస్‌ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్‌సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్‌లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్‌.

    ఈ ఎర్గోనామిక్‌ ఫేస్‌ లిఫ్టింగ్‌ మసాజర్‌.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్‌ చిన్‌ రెడ్యూసర్‌ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్‌తో పాటు సాఫ్ట్‌ అండ్‌  స్కిన్‌  ఫ్రెండ్లీ కంఫర్టబుల్‌ కోర్డ్‌ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్‌ ని చేత్తో పట్టుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

    ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్‌ను చెవులకు బిగించుకుంటే చాలు..  గడ్డం కింద మెషిన్‌ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్‌ పెట్టుకుని యూజ్‌ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్‌మెంట్‌ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!

    ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??

  • పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.

    ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.

    ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.

    అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా..  తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.

    ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.

    ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు  పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.

    మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న  విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది.  ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.

    తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.

    అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.

    మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ  చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.

    ‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు
     

  • బాలీవుడ్‌, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్‌ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అ‍న్నారు. 

    బహుశా ఇది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్‌ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్‌ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్‌ రియాక్షన్‌ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. 

    కాగా, నటుడు గతేడాది డిసెంబర్‌లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్‌కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్‌ఆర్పీఎఫ్‌ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్‌లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్‌ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను  తానెప్పుడూ ఫేస్‌ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్‌ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. 

    నిజంగా కోవిషీల్డ్‌ ప్రమాదకరమైనదా..?
    భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన  కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా  థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్‌)తో థ్రాంబోసిస్‌కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. 

    అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్‌ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్‌ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. 

    అలాగే ఈ ‍వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్‌ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.

    (చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్‌ అబ్రహం ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! అందుకే..!)

     

  • ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.

    ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. 
          ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.

    ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు.
          ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.
    ‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు.
          విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.

    రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు.
          ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు.
          ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు.
          ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు.
          ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.

    ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. 
          ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు.

          ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.
    ‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు.
          ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.
    అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.
    విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.

    ‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.

    ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయన

    ఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?

  • ‘మంత్రాలకు, శాపాలకు ఏదైనాసరే.. రాయిగా మారిపోతుంది’ అనే మాటను పురాణగాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఈ బావిలోని నీళ్లు దేన్నైనాసరే నిలువునా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇంగ్లండ్‌లోని ‘పెట్రిఫైయింగ్‌ వెల్‌’ చరిత్ర ఓ మిస్టరీ. దీన్నే ‘మదర్‌ షిప్టన్‌ కేవ్‌’ అని కూడా పిలుస్తారు.

    నార్త్‌ యార్క్‌షైర్‌లోని అందమైన ప్రాంతాల్లో నేజ్‌బ్ర ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఆ నుయ్యి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా.. మరికొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీ కప్పులు, టెడ్డీబేర్‌ ఇలా ప్రతిదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతాకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులను ఇలా, ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియమ్స్‌లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్నినెలల పాటు ఉంచిన సైకిల్‌ రాయిగా మారిపోవడం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది.

    నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ్ల చాలవు. నిడ్‌ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం..1630 నుంచి పర్యాటకేంద్రంగా వాసికెక్కింది. అప్పటి నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రావెర్టైన్‌ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్‌ షిప్టన్‌  గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తుంది.

    ఆ గుహలోనే.. 1488లో అగాథ సూత్‌టేల్‌ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ బిడ్డ పేరు ‘ఉర్సులా సౌథైల్‌’ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్దపెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానిక కథనం. అంతేకాదు ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట.

    హెన్రీ Vఐఐఐ (1547) మరణం, గ్రేట్‌ ఫైర్‌ ఆఫ్‌ లండన్‌ (1666) వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలామంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు ‘మదర్‌ షిప్టన్‌ ’గా మారింది.

    ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరంపెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితో ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించినవారంతా ఆ నుయ్యి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలుపెట్టారు.

    ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏమిటంటే 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంలా ఉందనే ప్రచారమూ సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది.. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా! అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనేదానిపై స్పష్టత లేదు.

    మదర్‌ షిప్టన్‌  చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలామంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారమూ ఊపందుకుంది.

    ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నింబధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అసలు ఈ నీరు ఎప్పటి నుంచి అలా మారింది? ఉర్సులా సౌథైల్‌ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలూ  ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికీ ఈ గుహ వెనకున్న కథ మిస్టరీనే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన

    ఇవి చదవండి: మధిర టు తిరుపతి.. 'సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'

  • ఇండియాలో ఫ్యాషన్‌ సీన్‌ని.. బాలీవుడ్‌ సెలబ్రిటీల గ్లామర్‌ గ్రామర్‌ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్‌ డిజైనర్స్, స్టార్‌ స్టయిలిస్ట్‌లలో టాప్‌ ఆఫ్‌ ది ఆల్‌గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా! యాక్ట్రెస్‌ దీపికా పదుకోణ్‌కి పర్సనల్‌ స్టయిలిస్ట్‌! క్యాజువల్‌ లుక్స్‌ నుంచి కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌ అపియరెన్స్‌ దాకా.. దీపికా సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!

    ఫ్యాషన్‌ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్‌ సెన్స్‌ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్‌ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్‌ని డిజైన్‌ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్‌ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.

    అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్‌ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్‌ చేసుకునేలా ఇన్స్‌పైర్‌ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్‌ డిజైన్‌ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్‌ల మేళవింపుతో పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

    ఫ్యాషన్‌ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్, స్టార్‌ స్టయిలిస్ట్‌ అనాయితా శ్రాఫ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్‌లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ఆమె చేసిన వర్క్‌ నచ్చి శలీనాను తన పర్సనల్‌ స్టయిలిస్ట్‌గా అపాయింట్‌ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.

    ఓవర్‌ సైజ్డ్‌ కాస్ట్యూమ్స్‌ పట్ల యూత్‌కి క్రేజ్‌ పెంచిన క్రెడిట్‌ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్‌ స్టైల్‌గా వైరల్‌ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్‌ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.

    దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్‌ఫిట్‌నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్‌ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్‌ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్‌ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్‌’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్‌ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్‌ ఆర్యన్, సిద్ధార్థ్‌ కపూర్, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి బాలీవుడ్‌ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేసింది.

    "డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్‌మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్‌పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక‍్స్‌ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ.

International

  • హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్‌ నెటవర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్‌ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.  

    ‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్‌ నెట్‌వర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేస్తున్నాం. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్‌ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ​ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.

    గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్‌ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్‌ తిరస్కరించారు. హమాస్‌ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్‌ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. 

    మరోవైపు.. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్‌, ఈజిప్ట్‌, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్‌ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.    

Telangana

  • సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో  పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ సమీపంలోని ఆఫ్టర్ 9  పబ్‌పై శనివారం రాత్రి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్‌ను క్లోజ్‌ చేయించి.. కేసు నమోదు చేశారు.

    కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్‌ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.


     

Business

  • కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.

    సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.

    2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.

    యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.

    అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది.

  • గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71830 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ.100 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71980 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.100 వరకు తగ్గినా గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.

    దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 66000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72000 రూపాయల వద్ద ఉంది. నిన్న గోల్డ్ రేటు రూ. 100 పెరిగింది. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 5) ఒక కేజీ వెండి ధర 83000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Cartoon