IPL 2024: చ‌రిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు |IPL 2024 PBKS Vs CSK: Ravindra Jadeja Breaks MS Dhonis Massive Record For CSK In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS Vs CSK: చ‌రిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు

Published Sun, May 5 2024 11:18 PM

Ravindra Jadeja breaks MS Dhonis massive record for CSK in IPL history

ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగ‌ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా కీల‌క పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను జ‌డ్డూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వ‌రిచింది.

ఈ క్ర‌మంలో జ‌డేజా ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌పున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆట‌గాడిగా జ‌డ్డూ నిలిచాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డుల‌ను గెలుచుకున్నాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును జ‌డేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మ‌రో రికార్డును జడ్డూ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 40 పైగా ప‌రుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌, షేన్ వాట్స‌న్ స‌ర‌స‌న జ‌డేజా చేరాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్స‌న్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశారు.

Advertisement
Advertisement