తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్‌.. ఆసక్తిగా వీడియో | Sakshi
Sakshi News home page

తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్‌.. ఆసక్తిగా వీడియో

Published Sat, May 18 2024 9:33 PM

Superstar Bujji Reveal In Kalki 2898 AD Movie

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్‌ చేసిన ఒక పోస్ట్‌తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్‌ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి.' అంటూ అయిన షేర్‌ చేసిన పోస్ట్‌పై అందరూ ఎంతగానో ఆస​క్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత  'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్‌ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. చాలా ఆస​‍క్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్‌ను కీర్తి సురేష్‌ ఇచ్చింది. 'నా లైఫ్‌ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్‌ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్‌ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్‌ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్‌ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది.


 

Advertisement
 
Advertisement
 
Advertisement