Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Not Hardik Or Pant MSK Prasad Says This Star Was Groomed As India CaptainAfter Rohit
హార్దిక్‌ కాదు!.. రోహిత్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే!

టీమిండియా భవిష్య కెప్టెన్‌ గురించి బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్‌ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్‌ వన్‌గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్‌ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్‌-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్‌ సేన.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్‌ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్‌ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్‌ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన‌ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా మాత్రం అయ్యర్‌ దూసుకుపోతున్నాడు. ‌ ‌ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేకేఆర్‌ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ అయ్యర్‌ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్‌ అయ్యర్‌ను టీమిండియా తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్‌లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్‌ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తర్వాత సారథిగా రిషభ్‌ పంత్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ పోటీపడుతున్నాడు. పంత్‌ కంటే ముందే..నిజానికి పంత్‌ కంటే కూడా శ్రేయస్‌ అయ్యర్‌ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్‌స్ట్పోర్ట్స్‌తో ఎంఎస్‌కే ప్రసాద్‌ వ్యాఖ్యానించాడు.‌ అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ 

కేకేఆర్‌ (PC: IPL)
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’

లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్‌ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్‌లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(14 బంతుల్లో 32), సునిల్‌ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్‌ బ్యాటర్‌ రమణ్‌ దీప్‌ సింగ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్‌ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్‌ రాణా(3/24, రసెల్‌(2/17), మిచెల్‌ స్టార్క్‌(1/22).. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి(3/30), సునిల్‌ నరైన్‌(1/22) లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్‌ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్‌లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్‌ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్‌. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్‌ఆర్‌హెచ్‌ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్‌ చోప్రా శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్‌ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్‌ టాపర్‌ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌  ఈ ఎడిషన్‌  సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. వసీం అక్రం కౌంటర్‌High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024

IPL 2024 Playoffs Chances For The Teams
IPL 2024: ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్‌ మొత్తంలో 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్‌రేట్‌) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.కేకేఆర్‌ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్‌రేట్‌), సీఎస్‌కే (11 మ్యాచ్‌ల్లో  6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్‌రేట్‌), సన్‌రైజర్స్‌ (10 మ్యాచ్‌ల్లో  6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్‌రేట్‌), లక్నో (11 మ్యాచ్‌ల్లో  6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్‌రేట్‌), ఢిల్లీ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్‌రేట్‌), ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో  4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్‌రేట్‌), పంజాబ్‌ (11 మ్యాచ్‌ల్లో  4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్‌రేట్‌), గుజరాత్‌ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్‌రేట్‌), ముంబై ఇండియన్స్‌ (11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్‌రేట్‌) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇలా..ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్‌ నుంచి ఎలిమినేట్‌ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్‌కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సున్నా అని చెప్పాలి.ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్‌ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి.ఇక ముంబై, గుజరాత్‌ తర్వాత ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్‌, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. పంజాబ్‌కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్‌, కేకేఆర్‌ జట్లు ఫైనల్‌ ఫోర్‌ బెర్త్‌లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్‌, సీఎస్‌కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్‌కు 99, రాజస్థాన్‌కు 98 శాతం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉండగా.. సన్‌రైజర్స్‌కు 75, సీఎస్‌కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. 

ధోనిపై విమర్శలు (PC: BCCI)
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్‌ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్‌లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు మిచెల్‌ సాంట్నర్, శార్దూల్‌ ఠాకూర్‌ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్‌ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్‌ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్‌ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ రావడం ఏమిటి? ఠాకూర్‌ ఎప్పుడైనా హిట్టింగ్‌ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్‌ ఓవర్లలో సీఎస్‌కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్‌ సింగ్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌ సీఎస్‌కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది.‌‌‌‌ ఇక ఫినిషింగ్‌ స్టార్‌ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. వసీం అక్రం కౌంటర్‌The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024

Amid Gavaskar Criticism Wasim Akram Striking Verdict On Kohli Scoring Rate
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

పదకొండు ఇన్నింగ్స్‌.. 542 రన్స్‌.. సగటు 67.75.. స్ట్రైక్‌ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్‌. ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్‌లు నాలుగు.వరల్డ్‌కప్‌ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూఈ సీజన్‌ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్‌రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్‌కప్‌ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్‌ వేశాడు.మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్‌ ఆడాముఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్‌ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌పై కోహ్లి ఫ్యాన్స్‌ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్‌ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు సరికాదుఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ లెజెండరీ పేసర్‌ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు. ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్‌ విజయాలతో గాడిలో పడింది.చదవండి: ‘ధనాధన్‌’ ధోని డకౌట్‌.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

Scotland Earn Maiden ICC Women's T20 World Cup Berth
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్‌

స్కాట్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్‌ సెమీస్‌లో స్కాట్లాండ్‌ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం తపిస్తున్న స్కాట్లాండ్‌ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. మరో సెమీస్‌లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్‌తో పాటు వరల్డ్‌కప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్‌ పోటీల నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్‌, పాక్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-ఏలో.. స్కాట్లాండ్‌.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్‌-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.Flower of Scotland: World Cup Qualification Edition 🤩🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿 pic.twitter.com/zt8Gsm7gr2— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్‌ రెండు జట్లు అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్‌ 20న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరుగనుంది.స్కాట్లాండ్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ (తొలి సెమీస్‌) విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్‌ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్‌  బ్రైస్‌ ఆల్‌రౌండ్‌ షోతో (4-0-8-4, 35 నాటౌట్‌) ఇరగదీసి స్కాట్లాండ్‌ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.రెండో సెమీస్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌లో స్కాట్లండ్‌, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి.

IPL 2024 Preity Zinta Reaction To Dhoni First Ball Duck Breaks Internet
‘ధనాధన్‌’ ధోని డకౌట్‌.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్‌ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 28 పరుగుల తేడాతో సామ్‌ కరన్‌ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా  ఐపీఎల్‌లో వరుసగా ఆరోసారి సీఎస్‌కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్‌ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్‌ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ స్టార్‌ మహేంద్ర సింగ్ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్‌-2024లో మూడో మ్యాచ్‌ నుంచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన తలా.. పంజాబ్‌తో పోరుకు ముందు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వింటేజ్‌ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్‌ కాగానే సీఎస్‌కే ఫ్యాన్స్‌ అంతా సైలెంట్‌ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(21 బంతుల్లో 32), వన్‌డౌన్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(30), సామ్‌ కరన్‌(7), అశుతోశ్‌ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్‌కే పంజాబ్‌ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’‌ పోరులో తామే ‘సూపర్’‌ అనిపించుకుంది.‌Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024

IPL 2024 LSG VS KKR: RAMANDEEP SINGH TAKES ONE OF THE GREATEST CATCHES OF IPL
ఐపీఎల్‌ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్‌-లక్నో మ్యాచ్‌ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రమన్‌దీప్‌ సింగ్‌ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అర్శిన్‌ కులకర్ణి ఆడిన షాట్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్‌ సింగ్‌ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్‌ చేసే డైరెక్షన్‌ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్‌ అర్శిన్‌ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్‌ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్‌ స్టార్క్‌, పక్కనే ఫీల్డింగ్‌ చేస్తున్న  రసెల్‌ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్‌ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్‌ (6 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్‌ రాణా (3.1-0-24-3), వరుణ్‌ చక్రవర్తి (3-0-30-3), రసెల్‌ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో నరైన్‌, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్‌ సాల్ట్‌ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్‌), రఘువంశీ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 3, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, యుద్‌వీర్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం​ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్‌ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

Terror Threat To T20 World Cup 2024 In West Indies From North Pakistan Says Report
టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు

పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు (కరీబియన్‌ దీవులు) ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పొట్టి ప్రపంచకప్‌ సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు తెలుస్తుంది. ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు ప్రారంభించాయి. తమ మద్దతుదారులంతా యుద్ధరంగంలో చేరాలని పిలుపునిస్తున్నాయి.ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చింది. టోర్నీకి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని ప్రకటించింది. క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్స్ హామీ ఇచ్చారు.కాగా, టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ కూడా ఆతిథ్యమిస్తుంది. జూన్‌ 1 నుంచి ఈ క్రికెట్‌ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌ యూఎస్‌ఏలోని డల్లాస్‌ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ జట్టు.. వారి పక్క దేశమైన కెనడాతో తలడనుంది. మెగా టోర్నీ భారత్‌ ప్రస్తానం జూన్‌ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌లో బిగ్‌ ఫైట్‌, దాయాదుల సమరం జూన్‌ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. 

IPL 2024: Mumbai Indians To Take On Sunrisers In Wankhede Today
MI Vs SRH: ఐపీఎల్‌లో నేడు (మే 6) మరో బిగ్‌ మ్యాచ్

ఐపీఎల్‌లో ఇవాళ మరో భారీ మ్యాచ్‌ జరుగనుంది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై హోం గ్రౌండ్‌ అయిన వాంఖడేలో రాత్రి 7: 30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ‌ఈ సీజన్‌లో ముంబై వరుస చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మహాద్భుతం జరిగే తప్ప ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు (సన్‌రైజర్స్‌, కేకేఆర్‌, లక్నో) ఆడాల్సి ఉంది.సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ప్రధాన పోటీదారుగా ఉంది. సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు (ముంబై, లక్నో, గుజరాత్‌, పంజాబ్‌) ఆడాల్సి ఉంది. ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్‌ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌: ఐపీఎల్‌లో ముంబై, సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 12, సన్‌రైజర్స్‌ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య తలపడిన మ్యాచ్‌లో అతి భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ట్రవిస్‌ హెడ్‌ (62), అభిషేక్‌ శర్మ (63), మార్క్రమ్‌ (42 నాటౌట్‌), క్లాసెన్‌ (80 నాటౌట్‌) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్‌ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేసి సన్‌రైజర్స్‌ శిబిరంలో దడ పుట్టించింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. రోహిత్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (34), నమన్‌ ధిర్‌ (30), తిలక్‌ వర్మ (64), హార్దిక్‌ పాండ్యా (24), టిమ్‌ డేవిడ్‌ (42 నాటౌట్‌), రొమారియో షెపర్డ్‌ (15 నాటౌట్‌) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను భయపెట్టారు.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్‌: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధిర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార [ఇంపాక్ట్‌ ప్లేయర్‌: నేహాల్ వధేరా]సన్‌రైజర్స్‌: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ [ఇంపాక్ట్‌ ప్లేయర్‌: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్]

Advertisement
Advertisement

Sports

1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
Advertisement