ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

Published Mon, May 6 2024 2:05 PM

ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కెజీఎఫ్‌: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మహిళా సంస్కరణ సమితి జిల్లా అధ్యక్షురాలు ఎం శశికళ నేతృత్వంలో కార్యకర్తలు ఆదివారం బంగారుపేట పట్టణంలో ప్రజ్వల్‌ రేవణ్ణ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎం శశికళ... ఎంపీ ప్రజ్వల్‌ వందలాది మంది మహిళల జీవితాలతో చెలగాటం ఆడారని, ప్రజ్వల్‌, అతని తండ్రి రేవణ్ణ అత్యంత నీచకృత్యాలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విదేశాలలో దాక్కున్న ప్రజ్వల్‌ను దేశానికి రప్పించాలన్నారు. ఆందోళనలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హరీష్‌, జిల్లా అధ్యక్షురాలు గిరిజా, కార్యదర్శి సీమా, సరస్వతి, లలితమ్మ, భారతి, మంజుల, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement