పోలింగ్‌కు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Published Mon, May 6 2024 2:05 PM

పోలిం

హొసపేటె: రెండో విడతలో ఈనెల 7న జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. హడగలి నియోజక వర్గంలో 218 పోలింగ్‌ కేంద్రాలు, హగరిబోమ్మనహళ్లి నియోజక వర్గంలో 254, విజయనగరంలో 259, కూడ్లిగి నియోజక వర్గంలో 250, హరపనహళ్లి నియోజకవర్గంలో 253 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

రాయచూరు పరిధిలో

2 లక్షలకు పైగా ఓటర్లు

రాయచూరు రూరల్‌: రాయచూరులో లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాయాచూరు లోక్‌సభ పరిధిలో 2.10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, 2,203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 10,336 మంది ఎన్నికల విధుల్లో ఉన్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాహుల్‌ కుమార్‌, ఎస్పీ నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్‌వి కావు

రాయచూరు రూరల్‌: దేశంలో అధికారం చేపట్టిన బీజేపీ పేదలను పట్టించుకోవడం లేదని, సంక్షేమ పథకాలు తామే ప్రవేశపెట్టామని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుటోందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాజ్యాంగంలోనే రాసి ఉందని గుర్తు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే బీఎస్పీ అభ్యర్థి నరసనగౌడను గెలిపించాలని కోరారు.

రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం తగదు

రాయచూరు రూరల్‌: బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం అన్యాయమని కేపీసీసీ నేత ద్వారకనాథ్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... , ఎస్పీ, ఎస్టీల రిజర్వేషన్ల తొలగింపు చేస్తామని చెప్పడం అసమంజసమని ధ్వజమెత్తారు. బుడకట్టు వర్గానికి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య బుడకట్టు మండలిని ఏర్పాటు చేసి రూ.250 కోట్ల నిధులను కేటాయించారన్నారు. రాజ్యాంగం పట్ల హేళన వ్యాఖ్యలు తగవన్నారు.

ఓటు వేసి గెలిపించాలి

హొసపేటె: బళ్లారి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఈ తుకారాంకు మద్దతుగా ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప ఆధ్వర్యంలో ఆదివారం అబ్దుల్‌ వహాబ్‌ సాబ్‌ నివాసంలో ముస్లిం సంఘాల నాయకుల సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. గవియప్ప మాట్లాడుతూ తుకారాంను మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజ్జల నాగరాజు, గచ్చా ఖాదర్‌, ఆడిటర్‌ మహ్మద్‌ పాల్గొన్నారు.

అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి మహేష్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రజలు దేశ సుభిక్షత కోసం బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదని అన్నారు.

ధనవంతులకే మోదీ అండ

సాక్షి, బళ్లారి: గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ధనవంతులకు కొమ్ము కాస్తు, పేదల సంక్షేమం, అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అలాంటి బీజేపీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి దివాకర్‌బాబు పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాంకు మద్దతుగా నగరంలోని సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్టీ నేతలు ఆర్‌.ఎస్‌ చాంద్‌బాష, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం
1/4

పోలింగ్‌కు సర్వం సిద్ధం

పోలింగ్‌కు సర్వం సిద్ధం
2/4

పోలింగ్‌కు సర్వం సిద్ధం

పోలింగ్‌కు సర్వం సిద్ధం
3/4

పోలింగ్‌కు సర్వం సిద్ధం

పోలింగ్‌కు సర్వం సిద్ధం
4/4

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Advertisement
 
Advertisement