శ్రీదేవికి ఇ‍ష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్! | Bollywood Actress Janhvi Kapoor Visits Famous Temple In Chennai | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అమ్మకి ఇష్టమైన ఆలయానికి వచ్చా: జాన్వీ కపూర్

May 27 2024 1:14 PM | Updated on May 27 2024 1:22 PM

Bollywood Actress Janhvi Kapoor Visits Famous Temple In Chennai

బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా పాల్గొన్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్‌ రావు సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మహిమ అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఒక్కసారిలో చెన్నైలో వాలిపోయింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై కేకేఆర్‌కు మద్దతుగా సందడి చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న జాన్వీ కపూర్‌ ప్రముఖ ముప్పాతమ్మన్‌ ఆలయాన్ని మొదటిసారి దర్శించుకుంది. శ్రీదేవి సిస్టర్‌ మహేశ్వరితో కలిసి ఆలయానికి వెళ్లింది. అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆలయాన్ని మొదటిసారి సందర్శించానని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో దేవర చిత్రంలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement