-
Weekly Horoscope: ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి
మేషంఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో మనశ్శాంతి లోపం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.వృషభంకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అన్నింటా విజయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.మిథునంఆర్థిక పరిస్థితి మొదట్లోకొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం. వారం చివరిలో ఒత్తిడులు. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.కర్కాటకంపనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు గందరగోళం నుండి విముక్తి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో మానసికఅశాంతి. కుటుంబంలో నిరాశ. తెలుపు, చాక్లెట్æరంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కన్యకొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.తులపనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొత్త వివాదాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.ధనుస్సుఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.మకరంఅనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులలో భారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, తెలుపు రంగులు, గణేశ్‌ను పూజించండి.మీనంఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. -
Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
మేషంమరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చరంగులు. దేవీస్తుతి మంచిది.వృషభంముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు. సోదరులు, మిత్రులు మీకు వెన్నంటి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారి సేవలకు గుర్తింపుతో పాటు, సన్మానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునంరుణవిముక్తికి చేసే యత్నాలు సఫలం. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. వేడుకల నిర్వహణలో భాగస్వాములు కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. పసుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.కర్కాటకంపట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లా¿¶ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.సింహంమొదట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌర విస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.కన్యఅనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.తులమీ యుక్తి, ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరాక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.ధనుస్సుపట్టుదలతో ముందుకు సాగండి, విజయాలు చేకూరతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీసహాయం కోసం మిత్రులు ఎదురుచూస్తుంటారు. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీహోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మకరంసన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. మీ శక్తిసామర్థ్యాలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మద్యమధ్యలో కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.కుంభంముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వి¿ే దాలు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.మీనంనూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు ఆందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. -
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
మేషం నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. చాక్లెట్, ఎరుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. వృషభం కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. మిథునం అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో ఆరోగ్యం సహకరించదు. వృథా ఖర్చులు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థతను చాటుకుని మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువర్గం నుండి సమస్యలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. పసుపు, గులాబీరంగులు, వినాయకుని పూజించండి. కన్య ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొన్ని హామీలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. మానసికంగా ఆందోళన. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి. తుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు సాధించాలనుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి. వృశ్చికం చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. కష్టానికి ఫలితం రాదు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి. ధనుస్సు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొంత ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి. మకరం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి. కుంభం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పోస్టు రావచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నీలం, లేత పసుపు రంగులు, వారం ప్రారం¿¶ ంలో దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దుర్గాస్తోత్రాలు పఠించండి. -
Weekly Horoscope: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మేషం: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: అమితోత్సాహంతో పురోగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి. మిథునం: మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది. సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబ సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది. తుల: నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి. మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చరంగులు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గామాతకు అర్చన చేయండి. మీనం: ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. -
Weekly Horoscope: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు..
మేషం ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. ∙వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి. మిథునం నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుండి అనుకూలత లభిస్తుంది. భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుండి ఊహించని పిలుపు రావచ్చు. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా సానుకూలత లభిస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కర్కాటకం నూతన ఉద్యోగాలను దక్కించుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయమే. ఒక ముఖ్య వ్యక్తిని కలుసుకుని చర్చలు జరుపుతారు. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. సోదరులతో వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రాజకీయవేత్తలకు ఎనలేని గౌరవం లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. సింహం కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయపడతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీపై అందరికీ ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు కొన్ని నిజం కాగలవు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు ఇబ్బందిరాదు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ ప్రతిభను గుర్తిస్తూ పురస్కారాలు రావచ్చు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా నడిపిస్తారు. ఉద్యోగులకు అంచనాలు నిజం కాగల అవకాశం. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో లేనిపోని ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. నీలం, లేత పసుపురంగులు, గణపతి అర్చనలు చేయండి. తుల ఇంటి ఖర్చులు పెరిగి రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మనస్సు చంచలంగా ఉంటుంది. మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలలో సర్దుబాట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు చేజారే సూచనలు. వ్యాపారాలలో వేగం తగ్గి నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరిగి కొంత అసంతృప్తి చెందుతారు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృశ్చికం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక సమస్య ఎట్టకేలకుæ పరిష్కారమవుతుంది. అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరులు, సోదరీలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు.. చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.ఉద్యోగులకు అనుకోని మార్పులు లాభిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను సజావుగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, చాక్లెట్‌రంగులు, శివాష్టకం పఠించండి. మకరం కొన్ని వ్యవహారాలలో∙జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులు, బంధువుల ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. వృథా ఖర్చులు. గులాబీ, పసుపురంగులు, ఆదిత్య హృదయం పఠించండి. కుంభం కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలను తొలగించుకుని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలపై సంతృప్తి చెందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పెట్టుబడులు పెంచుకుని విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, కనకధారాస్తోత్రం పఠించండి. మీనం తెలివిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వేడుకలలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలను లాభాలబాటలో నడిపిస్తారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళారంగం వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement