IPL 2024: సీఎస్‌కేపై ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ ఆర్సీబీ | Sakshi
Sakshi News home page

IPL 2024: సీఎస్‌కేపై ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ ఆర్సీబీ

Published Sun, May 19 2024 12:14 AM

RCB Seal Final IPL 2024 Playoff Spot Beating CSK by 27 runs

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స‌త్తాచాటింది.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగ‌ళూరు ఖారారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫాప్ డుప్లెసిస్‌(54) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. విరాట్ కోహ్లి(47), ర‌జిత్ పాటిదార్‌(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంత‌రం 219 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌(61) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖ‌రిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్ రెండు వికెట్లు,  మాక్స్‌వెల్‌, సిరాజ్‌, గ్రీన్‌, ఫెర్గూస‌న్ త‌లా వికెట్ సాధించారు.

అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయిన‌ప్ప‌టికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించి ఉండేది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.

ఆర్సీబీ పేస‌ర్ య‌శ్ ద‌యాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి
త‌న జ‌ట్టుకు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement