నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా.. | CM YS Jagan Today Election Campaign Schedule At Repalle, Check Details Inside | Sakshi
Sakshi News home page

CM Jagan Election Campaign: నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

Published Mon, May 6 2024 4:54 AM

CM YS Jagan Election Campaign Schedule At Repalle

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న(సోమవారం) మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

Advertisement
Advertisement