సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య | Sakshi
Sakshi News home page

Rakesh Bedi: మొన్న నటుడు.. ఇప్పుడు అతడి భార్య మోసపోయారు!

Published Sun, May 5 2024 4:31 PM

Actor Rakesh Bedi Wife Duped 5 Lakhs In Cyber Scam

ప్రముఖ నటుడి భార్య మోసపోయింది. తెలిసి తెలిసి లక్షల రూపాయలు పోగొట్టేసుకుంది. అయితే కొన్ని నెలల ముందు భర్త ఇలానే మోసపోగా.. ఇప్పుడు అతడి భార్యకు ఇలానే జరిగింది. అయితే తెలిసి మరీ ఇలా జరగడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు? అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

బాలీవుడ్‌లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్ బేడీ.. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాకేశ్‌కి చెందిన ఫ్లాట్ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్‌లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు.

ఇప్పుడు నటుడు రాకేశ్ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్‌)

Advertisement
Advertisement