IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌.. సీఎస్‌కే జట్టులో ఓ మార్పు | Sakshi
Sakshi News home page

IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌.. సీఎస్‌కే జట్టులో ఓ మార్పు

Published Sun, May 5 2024 3:21 PM

IPL 2024: Punjab Kings Won The Toss And Elected To Bowl First, Here Are Playing XI Of Both Teams

ఐపీఎల్‌లో ఇవాళ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం సీఎస్‌కే ఒక మార్పు చేయగా.. పంజాబ్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది. సీఎస్‌కే జట్టులో స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ స్థానంలో మిచెల్‌ సాంట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే

సీఎస్‌కేకు చాలా కీలకం..
ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 

ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్‌, 12న రాజస్థాన్‌ రాయల్స్‌, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. 

టెక్నికల్‌గా పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్‌.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్‌ రాయల్స్‌ (మే 15), సన్‌రైజర్స్‌ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 15, పంజాబ్‌ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్‌లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 



 

Advertisement
Advertisement