అడ్మిన్ ఏఎస్పీల నియామకం | Admin ASP of appointment | Sakshi
Sakshi News home page

అడ్మిన్ ఏఎస్పీల నియామకం

Published Fri, Dec 27 2013 2:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా జానకి దరవత్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్

సాక్షి, గుంటూరు: అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా జానకి దరవత్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ క్రైం-2 అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన జానకి తొలుత రాజమండ్రి డీఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత సైబరాబాద్‌లో క్రైం సీఐడీ విభాగంలో పనిచేసి పదోన్నతిపై కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఓఎస్డీగా వెళ్లారు.నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన జానకి బీటెక్ కంప్యూటర్స్ చేశారు. గుంటూరులోని విద్వాన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అర్బన్ ఓస్‌డీ వెలిశెల రత్న, జానకి ఇద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందినవారు కావటం విశేషం.
 రూరల్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా కోటేశ్వరరావు.. గుంటూరు రూరల్ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా డి.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.
 
 1985 బ్యాచ్‌కు చెందిన ఆయన తొలుత మంగళగిరి రూరల్ ఎస్‌ఐగా పనిచేశారు. అక్కడి నుంచి తెనాలి, తాడేపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, గుంటూరు కొత్తపేటలో పనిచేశారు. 2000 లో సీఐగా పదోన్నతి పొంది తెనాలి అర్బన్, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాలూకా, క్రైం సీఐగా పనిచేశారు. 2008లో డీఎస్పీగా పదోన్నతిపై రాజమండ్రి సీఐడీ విభాగం, మచిలీపట్నం, గుంటూరు టౌన్, వెస్ట్ డీస్పీగా పనిచేశారు. 2011లో గుంటూరులో అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీగా చేశారు. 2012లో ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. ఇదే జిల్లాలో సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్న కోటేశ్వరరావు అనేక సంచలనాత్మక కేసుల్ని ఛేదించిన అనుభవం గడించారు. ఎన్నికల సమయంలో సమర్ధ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement