పండుగ పూట గ్యాస్ కష్టాలు | gas problems to users | Sakshi
Sakshi News home page

పండుగ పూట గ్యాస్ కష్టాలు

Published Sun, Jan 12 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

పండుగ పూట ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇంట్లోవారితో సంతోషంగా ఉండాల్సిన పండగనాడు గ్యాస్ దొరకకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: పండుగ పూట ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇంట్లోవారితో సంతోషంగా ఉండాల్సిన పండగనాడు గ్యాస్ దొరకకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వా పోతున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా సిలిండర్లు గ్యాస్ సిలిం డర్లు ఇవ్వకపోవడంతో గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 పండుగకు గ్యాస్ వస్తుందని ఏజెన్సీ చుట్టూ తిరుగుతన్న వినియోగదారులకు నిరాశ మిగిలింది. గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ శేషుమా గ్యాస్ ఏజెన్సీకి  నాలుగురోజుగా గ్యాస్ కోసం వినియోగదారులు తిరుగుతున్నారు.  ఎప్పడొచ్చినా ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ లేదని చెబుతు నాలుగు రోజులుగా తిప్పుకుంటున్నారని మం డిపడ్డారు. గ్యాస్  కోసం ముందుగా బుక్ చేసుకున్నా సిలిండర్లు అందించడంలో నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు.

రోజు మాదిరిగానే ఆదివారం కూడా గ్యాస్ సిలిండర్ కోసం వచ్చిన వినియోగదారులకు ఏజెన్సీ బంద్ చేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశా రు. గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న గజ్వేల్- ప్రజ్ఞాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని  ఏజెన్సీ నిర్వాహకులను పిలిపించి సమస్యను పరిష్కరించడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement