
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. త్వరలోనే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధనలో విజయ సాయిరెడ్డి పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.