
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం వరకూ మూడు రోజులు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ గురువారం ఆర్‌బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)పై ప్రకటన వస్తుంది.
ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊపును ఇవ్వడానికి మరో దఫా రేటు కోత ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తుండగా, ఇప్పటికే తీసుకున్న రేటు కోత నిర్ణయాలను బ్యాంకింగ్ అమలు చేయడంపైనే ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని మరికొందరి విశ్లేషణ.