
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కష్టపడాలని బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. పేదలకు ఆరోగ్య బీమా, అన్ని ఇళ్లకు విద్యుత్ వంటి పథకాలను అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీజేపీ సీఎంలతో మోదీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏకకాల ఎన్నికలపై పార్టీ సుముఖంగానే ఉందని.. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చించామని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ చెప్పారు. పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.