
వినయ్ మినహా మిగతా ముగ్గురు దోషులను ఉరితీసేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మకు ఫిబ్రవరి 1న మరణ దండన విధించాల్సి ఉంది. అయితే, శిక్ష నుంచి తప్పించుకునేందుకు, ఉరి అమలును వాయిదా వేసేందుకు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. తాజాగా.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్షను వాయిదా వేయాలని వారి తరపు లాయర్ ఏపీ సింగ్ పటియాల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు వినయ్ మినహా మిగతా ముగ్గురు దోషులను ఉరితీసేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షను తప్పించుకునేందుకు దోషులు ఎత్తుగడలు వేస్తున్నారని, చట్టాలను మార్చాల్సి ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
(చదవండి : సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి)