అరుణాచల్ ప్రదేశ్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన పెమా ఖండూ(36) ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్న బలపరీక్ష నిర్వహించాల్సి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేకపోవడంతో అది వాయిదా పడింది. పెమా ఖండూ బాధ్యతలు చేపట్టిన తర్వాత బల పరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.