
సన్యాసి అంత్యక్రియలకు కోట్ల ఖర్చు
తమ మతానికి చెందిన సన్యాసి అంత్యక్రియలకోసం దేశీయంగా ఇతర దేశాల్లో ఉన్న జైనుల కమ్యూనిటీ ఏకంగా రూ.ఏడు కోట్లు పోగేసింది.
ముంబయి: తమ మతానికి చెందిన సన్యాసి అంత్యక్రియలకోసం దేశీయంగా ఇతర దేశాల్లో ఉన్న జైనుల కమ్యూనిటీ ఏకంగా రూ.ఏడు కోట్లు పోగేసింది. వేలం నిర్వహించి మరీ ఈ మొత్తాన్ని కూడగట్టింది. అంత్యక్రియల సందర్భంగా జరిపే 25 కార్యాక్రమాలకు వేలం నిర్వహించారు. ఇందులో ఆయన పాదాలను ప్రత్యేకంగా శుభ్రం చేసే క్రతువు కూడా ఉంది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని రాజ్ ఘర్ అనే చిన్నపట్టణంలో శ్రీ మద్విజయ్ రవీంద్రసురి మహారాజ్సాహేబ్జి(62) గతవారం కన్నుమూశారు.
దీంతో ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని వేలం నిర్వహించారు. ఇందులో ఆయన దేహానికి స్నానం చేయించడం, హారతి కార్యక్రమంవంటి కార్యక్రమాలకు వేలం నిర్వహించగా ఒక్కొక్కరు ఒక్కో కార్యక్రమాన్ని దక్కించుకున్నారు. తమ కమ్యూనిటీకి చెందిన సన్యాసిలకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తామని చెప్పారు. దుబాయ్ కు చెందిన జయేశ్ బాయ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.68 లక్షలు చెల్లించి తొలి కార్యక్రమాన్ని దక్కించుకున్నాడు.