‘కాగ్‌’ నివేదికపై చర్చకు సిద్ధమేనా? | Dasoju sravan kumar commented on kcr | Sakshi
Sakshi News home page

‘కాగ్‌’ నివేదికపై చర్చకు సిద్ధమేనా?

Published Sat, Mar 31 2018 12:52 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

Dasoju sravan kumar commented on kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కాగ్‌’నివేదికతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ బండా రం బయటపడిందని, దీనిపై టీఆర్‌ఎస్‌ నాయ కులకు దమ్ముంటే అమరవీరుల స్మారకస్థూపం వద్ద బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు చెప్పిన అంశాలు కాగ్‌ నివేదికతో నిజమని తేలిందన్నారు.

దేశంలోనే అప్పులను ఆదాయంగా చూపిన సన్నాసి ప్రభుత్వం కేసీఆర్‌దేని మండిపడ్డారు. లెక్కల్లో తప్పులు, అవకతవకలు కారణంగా చాలామంది జైళ్లలో ఉన్నారని, సీఎం కేసీఆర్‌కూ ఇదే వర్తిస్తుందని శ్రవణ్‌ హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్‌ 409 ప్రకారం కేసీఆర్‌కు జీవిత ఖైదు శిక్ష పడుతుందన్నారు. ఎవరైనా అభివృద్ధి కోసం అప్పులు చేస్తారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం చేసిందని విమర్శించారు. దీనిపై త్వరలోనే నీతిæఆయోగ్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement