ఏషియన్ గేమ్స్లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ చాంపియన్ ట్వీట్ చేయడం కలకలం రేపింది.