
సీనియర్ నటి సుమలత తనయుడి వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఎంటర్‌ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. ఈ పెళ్లికి పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఈ పెళ్లికి టాలీవుడ్ జంట కూడా హాజరైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న మంచు మనోజ్- భూమా మౌనిక వివాహా వేడుకలో సందడి చేశారు.

పెళ్లికి హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించారు మంచు మనోజ్- భూమా మౌనిక. పెళ్లిలో దిగిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

పెళ్లి ఫోటోలు షేర్ చేసిన మంచు మనోజ్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సతీసమేతంగా హాజరైన మనోజ్ చాలా హుషారుగా కనిపించారు.

పెళ్లి వేడుకలో పాల్గొన్న మంచు మనోజ్- భూమా మౌనిక దంపతులు

.

.

.