
ఆస్పరి: ప్రేమికులను విడదీసే పెద్దలు చూసుంటాం.. విషాదాంతం అయిన ప్రేమ కథలను వింటూ ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం అరుదుగా కనిపిస్తుంది

అలాంటి పోరాటమే ఒకటి ఆచారంగా ప్రతి ఏటా ఆస్పరి మండలంలోని కైరుప్పల గ్రామంలో కొనసాగుతోంది

వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాలు సందర్భంగా సోమవారం రెండు వర్గాల భక్తుల మధ్య ఉత్కంఠ భరితంగా పిడకల సమరం సాగింది

ఆచారం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీ మార్బలంతో ఊరేగింపుగా కైరుప్పల గ్రామానికి వచ్చారు

వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. ఆతరువాత పిడకల సమరం మొదలైంది

రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు పరస్పరం ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకున్నారు

వందల సంఖ్యలో గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపు అయ్యింది






