freedom of speach
-
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది. సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టుప్రెస్మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
వెంకయ్యకు నారాయణ కౌంటర్
హైదరాబాద్: చైనా, పాకిస్తాన్, రష్యా దేశాల సిద్ధాంతాలను భారత్ లో అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలను ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సీసీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధీటుగా బదులిచ్చారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య నాయుడు తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో నారాయణ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే 'అదేదో వారి గుత్తసొత్తు' గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. భావప్రకటనను ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ ఎటువంటి త్యాగాలు చేయని ఆర్ఎస్ఎస్ వారు దేశభక్తులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పినంత మాత్రాన నిజమై పోతుందనుకుంటే పొరబాటవుతుందని, అఫ్జల్‌గురు అంశానికీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు సంబంధం లేదని పదేపదే చెప్పినా వెంకయ్య నాయుడు పాతపాటే పాడుతున్నారని నారాయణ విమర్శిచారు. కన్హయ్య ఏనాడూ దేశ వ్యతిరేక శక్తులను సమర్థించలేదని, అయినా బీజేపీ నేతలు పదేపదే అదే ఆరోపణ చేస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తే ప్రజలే తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.