superintendent engineer
-
ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈగా రామ్ చంద్
బాన్సువాడ ఈఈగానే వెంకటేశ్వర్లు ఈఈ మల్లేశ్‌గౌడ్‌కు ఎస్ఈగా పదోన్నతి ఆదిలాబాద్ జిల్లా ఎస్ఈగా నియామకం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీరుగా లకావత్ రామ్‌చంద్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన రామ్‌చంద్ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన సత్యనారాయణ సుమారు ఏడు నెలల కిందట దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో బాన్సువాడ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరుగా పని చేస్తున్న డి.వెంకటేశ్వర్లుకు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్ఈగా, బాన్సువాడ ఈఈగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వర్లును ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో వరంగల్ ఎస్ఈ రామ్‌చంద్‌ను నియమించారు. కాగా నిజామాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరుగా పనిచేస్తున్న మల్లేశ్‌గౌడ్‌కు ఎస్ఈగా పదోన్నతి కలిగిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. -
సర్వీసు పొడిగింపునకు పైరవీలు
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ సర్వీసులో చేరింది మొదలు పలు వివాదాలు, ఆరోపణలు, విచారణలు ఎదుర్కొన్న సూపరింటెండింగ్ ఇంజనీరు(ఎస్ఈ) రాధాకృష్ణమూర్తి ఈ నెలాఖరులో రిటైర్ కావల్సి ఉంది. ఈ తరుణంలో సర్వీసును పొడిగించుకునేందుకు పైరవీలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఈ సర్వీసు పొడిగింపు ఫైలు చకచకా కదులుతున్నట్లు సమాచారం. అసలు ఆయన ఎస్ఈగా ఎదిగిన తీరుపైనే అనేక వివాదాలున్నారుు. డిప్లమోతోనే సర్వీసులో చేరిన ఆయన పదోన్నతి కోసం సమర్పించిన డిగ్రీ పట్టా కూడా వివాదాస్పదమైంది. ఆయన ఎస్ఈగా ఉన్న నాలుగేళ్లలో గోదాముల నిర్మాణంలో పలు అక్రమాలకు పాల్పడ్డట్టుగా కూడా ఆరోపణలున్నాయి. గతంలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుంటూరు మార్కెట్ యార్డుల అభివృద్ధి పనుల్లో ఆయన అక్రమాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు, అవినీతి నిరోధక శాఖ నిర్ధారించింది. అయినా రాధాకృష్ణ సర్వీసు పొడిగింపు ఫైలును ముఖ్యమంత్రికి సన్నిహితులైన కాంగ్రెస్ నాయకులు పైరవీలతో చకచకా కదిలిస్తున్నట్లు సమాచారం.