
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.
ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్‌కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.
2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది.