
న్యూఢిల్లీ: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. బహుళ సంత్స రాల బ్రాండ్ భాగస్వామ్యంగా దీన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
(చదవండి: IND VS ENG: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే)