
న్యూఢిల్లీ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించొద్దని ఎన్జీటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది.
చదవండి: (ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పదవీకాలం పొడిగింపు)