ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన శ్రీవల్లి రష్మిక | Shrivalli rashmikaa enter Pre quarters in ITAF | Sakshi
Sakshi News home page

ITAF Tournment: ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన శ్రీవల్లి రష్మిక

Published Thu, Mar 3 2022 9:19 AM | Last Updated on Thu, Mar 3 2022 9:57 AM

Shrivalli rashmikaa enter Pre quarters in  ITAF  - Sakshi

నాగ్‌పూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రేయ తటవర్తి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో రష్మిక 6–4, 6–3తో షర్మదా బాలు (భారత్‌)పై, సాత్విక 7–5, 6–2తో అదితి (భారత్‌)పై, శ్రేయ 6–3, 5–7, 6–3తో జగ్మీత్‌ కౌర్‌ గ్రెవాల్‌ (భారత్‌)పై గెలిచారు. 

చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్యానికి భారత్‌ బిడ్‌ 
అఖిల భారత చెస్‌ సమాఖ్య  ఈ ఏడాది చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ వేయనుంది. ఇందులో భాగంగా గ్యారంటీ మనీ కోటి డాలర్లను (రూ. 74 కోట్లు) అంతర్జాతీయ చెస్‌ సమాఖ్యకు డిపాజిట్‌ చేసింది. నిజానికి ఈ చెస్‌ మెగా టోర్నీ ఈ జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు రష్యాలో జరగాల్సింది. అయితే ఆ దేశం ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తుండటంతో అక్కడ ఈవెంట్‌ను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించారు.

చదవండి: Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్‌ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement