రాష్ట్ర విభజనకు సహకరించి సీమాంధ్రులను మోసగించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు పార్టీ పెడుతూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె సమన్వయకర్త ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కురబలకోట, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనకు సహకరించి సీమాంధ్రులను మోసగించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు పార్టీ పెడుతూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె సమన్వయకర్త ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కురబలకోట మండలం తెట్టుగ్రామంలో గురువారం ఆయన గడగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర పేరుతో జనాన్ని మోసగించిన కిరణ్ కొత్త పార్టీ పెట్టి చెవిలో పువ్యు పెడుతున్నారని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరిచేందుకు కొత్త పార్టీ వస్తున్నట్లుందన్నారు. రాష్ట్ర విభనకు చాపకింద నీరులా చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తెలుగు జాతి కలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం పదవి పోయాక ఉనికి కోసమే ఈ కొత్తపార్టీ పుట్టుకొస్తోందని విమర్శించారు. స్వార్థపరులను జనం నమ్మరన్నారు. ఎన్ మనోహర్‌రెడ్డి, ఎంజీ మల్లయ్య, కె ఫజరుల్లా, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.