
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు.
వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా చేవూరు హరికిరణ్, విజయనగరం జిల్లాకలెక్టర్‌గా ఎం.హరి జవహర్‌లాల్ నియ మితులయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న టి.బాబూరావు నాయు డును గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.