ఓ టీచర్ విచక్షణ కోల్పోయి కఠిన దండనకు దిగడంతో ఓ విద్యార్థి తలకు బలమైన గాయం అయింది.
పిఠాపురం :ఓ టీచర్ విచక్షణ కోల్పోయి కఠిన దండనకు దిగడంతో ఓ విద్యార్థి తలకు బలమైన గాయమైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురంలో ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న మేకా కామేశ్ (11) అనే విద్యార్థి తలపై టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమైంది. వెంటనే బాలుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్‌కు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ ప్రారంభించారు.