ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సభ్యులుగా డాక్టర్ పెర్వెల రఘు, పెండ్యాల రామ్మోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సభ్యులుగా డాక్టర్ పెర్వెల రఘు, పెండ్యాల రామ్మోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరూ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతార ని పేర్కొంది. రఘు 1979లో ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేశారు. తాజాగా ఆదాయం పన్నుశాఖ ముఖ్య కమిషనర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.
అంతకు ముందు ఆయన చెన్నై, హైదరాబాద్, గుంటూరు తిరుచ్చీ, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో ఐటీ అదనపు కమిషనర్‌గా, డిప్యూటీ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. రామ్మోహన్ ప్రస్తుతం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఈయన ఈఎంసీ డిజైన్ ఆఫ్ ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్‌లో పీహెచ్‌డీ చేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో సహాయ ఇంజనీర్‌గా చేశారు. ఏడీ, డీఈ, జీఎం, సీజీఎం, డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదిగారు.