హోదా కోసం ప్రాణత్యాగం : వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jaganmohan Reddy Condolence To Kurnool Students Who Suicide For Special Status | Sakshi
Sakshi News home page

హోదా కోసం ప్రాణత్యాగం : వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published Tue, Sep 18 2018 9:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YS Jaganmohan Reddy Condolence To Kurnool Students Who Suicide For Special Status - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన అన్నకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది మహేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement