రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పొత్తుల కోసం టీడీపీ పైరవీలు చేస్తోందని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మరోసారి ఢిల్లీలో బేరం పెట్టారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు ఒక దివాలాకోరు అని, తెలంగాణ నోట్ వచ్చే ఈ సమయంలోనైనా చంద్రబాబు మనసు మారాలని శివప్రసాద్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు యాత్రల్లో ఆత్మగౌరవం లేదని, ఉన్నదంతా ఆత్మవంచనేనని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.