
ఎగవేతదారుల బండారం బయటపెడతాం
రూ.70 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగనామం పెట్టిన 7 వేల కార్పొరేట్ సంస్థల పేర్లను త్వరలో బయట పెడతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది.
అహ్మదాబాద్: రూ.70 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగనామం పెట్టిన 7 వేల కార్పొరేట్ సంస్థల పేర్లను త్వరలో బయట పెడతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది. ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సంఘం నేత సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు.