దూసుకుపోతున్న మారుతి స్విఫ్ట్‌ | Maruti Suzuki Swift cross 90,000 units in less than 2 months  | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న మారుతి స్విఫ్ట్‌

Published Sat, Mar 17 2018 5:14 PM | Last Updated on Sat, Mar 17 2018 8:52 PM

Maruti Suzuki Swift cross 90,000 units in less than 2 months  - Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కారు బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. లాంచ్ అయిన  అతి స్వల్ప కాలంలోనే కీలకమైన  మైలురాయిని దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇండియన్‌కార్‌ ట్యాగ్‌తో జనవరి 18న మార్కెట్లో ఎంట్రీ ఎచ్చిన స్విఫ్ట్‌ థర్డ్‌ జనరేషన్‌​ కారు లక్ష బుకింగ్‌ల వైపు పరుగులు తీస్తోంది. కేవలం రెండు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా 90వేల బుకింగ్‌లను సాధించింది. మరోవారంలో లక్షమార్క్‌ దాటేస్తుందనే అంచనాను మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్‌ అంచనా వేశారు. 
  
అతిపెద్ద ప్యాసింజర్‌ కార్లు తయారీదారు మారుతి  సుజుకి అందించిన తాజా డేటా ప్రకారం టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ బుకింగ్స్‌ 31 శాతంగా  నమోదవ్వగా, మిడ్‌ టెర్మ్‌ వేరియంట్‌ బుకింగ్‌ 50 శాతంగా ఉన్నాయి. అన్ని అంచనాలను అధిగమించిన  స్విఫ్ట్‌  మోడల్‌ కారు జనరేషన్‌, జనరేషన్‌కి డిమాండ్‌ పుంజుకుంటోందని  మారుతి సుజుకి  సేల్స్‌ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సి తెలిపారు. ఈ  బుకింగ్స్‌ స్థిరీకరణకు మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చని పేర్కొన్నారు. కాగా స్విఫ్ట్‌ తొలి, రెండో జనరేషన్‌ కార్లు కూడా బెస్ట్‌ సెల్లర్స్‌గా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement